Jai Hanuman: హనుమంతుడిగా ఈ ఇద్దరిలో ఒకరు కనిపిస్తే పాన్ ఇండియా బాక్సాఫీస్ కంపిస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తేజ సజ్జ హీరోగా, ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేస్తుంది. జనవరి 12న రిలీజైన హనుమాన్ 200 కోట్లు కలెక్ట్ చేసి ఇంకా స్లో అవ్వలేదు. ఈ వారం కూడా హనుమాన్ సినిమా హవా కొనసాగనుంది. ఇప్పట్లో ఆగిపోయేలా కనిపించిన కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ… తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి ‘జై హనుమాన్’ సినిమా హనుమాన్ మూవీ ఎండింగ్ లోనే అనౌన్స్ చేసాడు. హనుమాన్ క్లైమాక్స్ లోనే జై హనుమాన్ సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చేసిన ప్రశాంత్ వర్మ… అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట రోజున జై హనుమాన్ ప్రీప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేస్తున్నట్లు చెప్పేసాడు. మీ అందరి ప్రేమాభిమానాలతో జై హనుమాన్ స్టార్ట్ చేస్తున్నాను అని ప్రశాంత్ వర్మ ట్వీట్ చేసాడు.
2025 సంక్రాంతికి జై హనుమాన్ సినిమా వస్తుందని చెప్పిన ప్రశాంత్ వర్మ… ఈ సినిమాలో ఎవరు నటిస్తున్నారు అనే విషయంలో క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. తేజ సజ్జ ఉంటాడు కానీ అతను హీరో కాదు హనుమంతుడే హీరో, ఒక పెద్ద స్టార్ హనుమాన్ గా కనిపిస్తాడు అని ప్రశాంత్ వర్మ చెప్పాడు. దీంతో ఇప్పుడు హనుమాన్ గా ఎవరు కనిపించబోతున్నారు అనే చర్చ సోషల్ మీడియాలో మొదలయ్యింది. ఎక్కువమంది సినీ అభిమానులు మాత్రం హనుమాన్ గా రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ లలో ఒకరు నటిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. రామ్ చరణ్ కి ఉన్న దైవ భక్తి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ‘హనుమాన్ మాల’ వేసుకున్నాడు. పాన్ ఇండియా గుర్తింపు ఉన్న చరణ్, ఎన్టీఆర్ లలో ఒకరు హనుమంతుడిగా నటించినా కూడా ‘జై హనుమాన్’ సినిమా రీచ్ కి మాటల్లో చెప్పడం కష్టం. అయితే ప్రశాంత్ వర్మ జై హనుమాన్ 2025 సంక్రాంతికే రిలీజ్ అంటున్నాడు కాబట్టి చరణ్, ఎన్టీఆర్ లకి ఉన్న కమిట్మెంట్స్ దృష్టిలో పెట్టుకోని ఆలోచిస్తే ఈ ఇద్దరూ నటించడం కష్టమనే చెప్పాలి. మరి జై హనుమాన్ సినిమాపైన ఉన్న నమ్మకంతో ఈ ఇద్దరిలో ఒకరు తమకి ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ ని అడ్జస్ట్ చేసుకోని జై హనుమాన్ సినిమా చేస్తారేమో చూడాలి.
Also Read
- Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
- Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
- Krrish 4 : 'క్రిష్ 4' ఆలస్యానికి కారణం అదే?
- LGBT - A Legal Battle: 'ఎల్జీబీటీ'ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
Grateful to everyone for all the love & support for this new beginning ❤️🔥
With utmost care & blessings of the almighty, promising you all another tale that will be celebrated across the globe big time 😊#JaiHanuman 🙏 pic.twitter.com/SdUB71u3vb
— Prasanth Varma (@PrasanthVarma) January 23, 2024
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!