These are the Officially Announced 20 Sequel films From Tollywood: టాలీవుడ్ లో ఒకప్పుడు లేదు కానీ ఎందుకో ఈ మధ్య ఎక్కువగా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఒక సినిమా హిట్ అవకముందే అది హిట్ అవుతుంది అని బలంగా నమ్మి సీక్వెల్ ప్రకటించి మొదటి కథకు దాని సీక్వెల్ కు సంబంధం లేకుండా సినిమాలు చేసేస్తున్నారు మేకర్స్. అసలు ఈ సీక్వెల్స్ గతంలో ఒకటీ అరా ఉన్నా ఎక్కువగా మేకర్స్ ఫాలో అయ్యేందుకు కారణం రాజమౌళి. బాహుబలి సినిమా మొత్తం ఒక సినిమాలో పట్టదని, కథను పూర్తిగా చెప్పలేమని రెండు భాగాలుగా తీసుకొచ్చాడు. అప్పుడు మొదలైన ఈ సీక్వెల్స్ జోరు ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. సినిమా చివరిలో దానికి కొనసాగింపు ఉంటుందని హింట్ ఇచ్చి సీక్వెల్ మీద అంచనాలను పెంచేస్తున్నారు మేకర్స్. ఒకటి కాదు.. రెండు కాదు దాదాపు ఓ పదిహేను సినిమాల వరకు సీక్వెల్స్ తెరకెక్కనున్నాయి.
ఇప్పటిదాకా అనౌన్స్ చేసిన సీక్వెల్స్ ఇలా ఉన్నాయి.
– పుష్ప 2 ది రూల్
– సాలార్ 2: శౌర్యంగ పర్వం
– దేవర 2
– జై హనుమాన్
– అఖండ 2
– టిల్లు స్క్వేర్
– డబుల్ ఇస్మార్ట్
– గూడాచారి 2
– హిట్ 3
– బింబిసార 2
– ప్రాజెక్ట్ Z
– గీతాంజలి మళ్లీ వచ్చింది
– శతమానం భవతి
– కార్తికేయ 3
– విరూపాక్ష 2
– దేవర 2
– కల్కి 2
– స్కంద 2
– పెదకాపు 2,
– మా ఊరి పొలిమేర 3 లాంటి సీక్వెల్స్ ఇప్పటికే అనౌన్స్ అయ్యాయి.
ఇందులో దాదాపు అన్ని సినిమాలు పార్ట్ 1 సూపర్ హిట్ టాక్ ను అందుకున్నా కొన్ని మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. మరి ఈ సినిమాల్లో ఏఏ సీక్వెల్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్స్ ను అందుకుంటాయో చూడాలి. అయితే అందుకు ఇంకొంతకాలం వేచి ఉండక తప్పదు. అయితే నిజానికి టాలీవుడ్ లో సీక్వెల్స్ అంతగా అచ్చి రాలేదు. హిట్ అయిన సినిమాకు సీక్వెల్ గా వచ్చిన చాలా సినిమాలు పరాజయాన్ని చవిచూశాయి కూడా. కేవలం బాహుబలి, కార్తికేయ, హిట్, కెజిఎఫ్ లాంటి సినిమాలకు కొనసాగింపుగా వచ్చిన సినిమాలు మాత్రమే మంచి విజయాన్ని అందుకున్నాయి.