These 8 Bollywood stars to shine in south : ప్రస్తుతం సౌత్ సినిమాలు ఇండియా వ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి. తమ భాషల్లో సూపర్ హిట్ గా నిలుస్తున్న సినిమాలను ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేయడానికి కొందరు మేకర్స్ ప్రయత్నిస్తుంటే మరికొందరు సినిమాను చేసినప్పుడే పాన్ ఇండియా ప్రాజెక్టులుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్ స్టార్స్ కూడా సౌత్ సినిమాల్లో మెరుస్తున్నారు. ఇప్పటికే దాదాపు ఎనిమిది మంది బాలీవుడ్ స్టార్లు సౌత్లో తెరకెక్కుతున్న పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులలో భాగమయ్యారు. ఒకసారి ఆ వివరాలలోకి వెళ్దాం.
ఇమ్రాన్ హష్మీ
బాలీవుడ్ లో రొమాంటిక్ హీరో అనగానే గుర్తొచ్చే పేరు ఇమ్రాన్ హష్మీ. ఆషిక్ బనాయా అనే సాంగ్ తో ఒక్కసారిగా సౌత్ లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ హీరో ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో సౌత్ లో కూడా మరోసారి సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన.
సన్నీ హిందుజా
ఓటీటీ స్పేస్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బాలీవుడ్ యాక్టర్ సన్నీ హిందూజా. ఆస్పిరంట్స్, ది రైల్వే మెన్, సందీప్, భయ్యా లాంటి ప్రాజెక్టులు చేసినా ఆయన మలయాళంలో తెరకెక్కుతున్న హలో మమ్మీ సినిమాతో సౌత్ సినిమాలో ఎంట్రీ ఇస్తున్నాడు. ఫాంటసీ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అతని పాత్ర కీలకంగా చెబుతున్నారు.
జామీ లివర్
సౌత్ నుంచి వెళ్లి నార్త్ లో సెటిల్ అయినా లెజెండరీ కమెడియన్ జానీ లివర్ కూతురైన జామీ లివర్ తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాతో ఆమె సౌత్ స్క్రీన్ మీద మెరిసే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే నార్త్ లో కామెడీ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు సౌత్ మీద దృష్టి పెట్టింది.
Samantha : షికార్లు అయిపోయాయ్.. ఇక డివోషనల్ మోడ్ ఆన్!
జాన్వీ కపూర్
శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ కూడా ఇప్పటివరకు ఎక్కువగా బాలీవుడ్ ప్రాజెక్టులలోనే భాగమవుతూ వచ్చేది. కానీ తొలి సారిగా ఆమె ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాలో హీరోయిన్గా నటిస్తూ సౌత్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది.
సైఫ్ అలీ ఖాన్
సైఫ్ అలీ ఖాన్ కూడా తన మొట్టమొదటి సౌత్ ఇండియన్ ప్రాజెక్టుగా దేవర అనే సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆయనకు విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.
బాబీ డియోల్
యానిమల్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న బాబీ డియోల్ ఇప్పుడు పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులతో సౌత్ ఇండియాలో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే ఆయన హరిహర వీరమల్లు అనే సినిమాలో భాగమయ్యాడు. దాంతో పాటు బాలకృష్ణ 109వ సినిమాలో కూడా ఆయన నటిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాక సూర్య కంగువా సినిమాలో కూడా ఆయన నటిస్తూ ఉండటం గమనార్హం.
షనాయా కపూర్
బాలీవుడ్ లో సెన్సేషన్ గా మారిన షనాయా కపూర్ మలయాళ వృషభం సినిమాతో సౌత్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో మన శ్రీకాంత్ కుమారుడు రోషన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారు.