‘తగ్గేదే లే’ అంటూ అల్లు అర్జున్ టాలీవుడ్ లో తన ఐకానిక్ మార్క్ చాటుకున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగం “పుష్ప : ది రైజ్ పార్ట్ 1” పేరుతో డిసెంబర్ 17న విడుదలకు సిద్ధమవుతోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్న “పుష్ప” విడుదల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఇక బన్నీ అభిమానులు అయితే ఇప్పటికే #50DaysForPushpaRajArrival అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.
Read also : “సర్కారు వారి పాట”లో ఎవరెవరు ఏఏ పాత్రలు చేస్తున్నారంటే ?
మరోవైపు మేకర్స్ సినిమా నుంచి వరుసగా పాటలను విడుదల చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకుల దృష్టిని “పుష్ప”పై పడేలా చేస్తున్నారు. ఇంతకుముందు విడుదలైన రెండు పాటలను తెలుగుతో పాటు హిందీ, మలయాళం, తమిళ, కన్నడ భాషల్లో విడుదల చేశారు. నిన్న ఈ సినిమా నుంచి “సామీ సామీ” సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. రష్మిక ఎక్స్ప్రెషన్స్, డాన్స్, అలాగే సింగర్ మౌనిక యాదవ్ వాయిస్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్, చంద్రబోస్ సాహిత్యం ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్నాయి. దీంతో ఫాస్టెస్ట్ 5 మిలియన్ వ్యూస్ దక్కించుకున్న సాంగ్ గా టాలీవుడ్ లో సరికొత్త రికార్డు నెలకొల్పింది పెప్పీ సాంగ్ “సామి సామీ”. యూట్యూబ్ లో ఇంకా ట్రెండ్ అవుతున్న ఈ సాంగ్ ను అన్ని భాషల్లో విడుదల చేసి, హిందీలో మాత్రం విడుదల చేయలేదు మేకర్స్. ఈ సాంగ్ ప్లేస్ లో హిందీ భాషలో మరో మాస్ సాంగ్ రానుందని అంటున్నారు. ఈ వార్తలు గనుక నిజమైతే బాలీవుడ్ ఖచ్చితంగా ఈ సూపర్ సాంగ్ ను మిస్ అవుతుందనే చెప్పాలి.