Site icon NTV Telugu

Bollywood 2025 : సీక్వెల్స్ తో భారీ ప్లాప్స్ చూసిన బాలీవుడ్

Bollywood

Bollywood

మొదటి నుంచి బాలీవుడ్‌లో సీక్వెల్స్ జోరు ఎక్కువగా ఉంది. పేరుకు సీక్వెల్సే కానీ ఫస్ట్ మూవీకి నెక్ట్స్ మూవీకి కనెక్షన్ ఉండదు. హిట్‌ అయిన సినిమా టైటిల్‌ని మాత్రమే కంటిన్యూ చేస్తూ స్టోరీ మీద సరైన కేర్‌ తీసుకోకపోవడంతో సినిమాలు దెబ్బతింటున్నాయి. అందుకే హిట్‌ అయిన నార్త్ బెల్ట్‌లో సీక్వెల్స్ సక్సెస్ రేష్యో పడిపోతోంది. ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో సితారే జమీన్ పర్ తప్ప మిగతావేవి చెప్పుకోదగిన హిట్‌ సాదించలేదు. సీనియర్ల నుండి జూనియర్ల వరకు సీక్వెల్స్‌తో వచ్చి డిజాస్టర్స్‌ చూసారు. హై బడ్జెట్‌, హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చిన వార్ 2 కూడా అంచనాలు అందుకోవడంలో తడబడింది. నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది.

Also Read : Bollywood : రొమాంటిక్‌ హీరో నుండి గ్యాంగ్‌స్టర్‌ గా మారిన బాలీవుడ్ హీరో

అక్షయ్ కుమార్ కామెడీ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన హౌజ్‌ఫుల్‌ 5, భారీ స్టార్‌ కాస్ట్‌ ఉన్నప్పటికీ రొటీన్ కామెడీ, వల్గర్‌ డైలాగ్స్‌ ఎక్కువగా ఉండడంతో ప్రేక్షకులు తిప్పికొట్టారు. దాదాపు రూ. 180కోట్లకు పైగా బడ్జెట్‌ తెరకెక్కిన ఈమూవీ కనీసం హౌజ్‌ఫుల్‌ 4 కలెక్షన్ల మార్క్‌ను కూడా అందుకోలేకపోయింది. బడ్జెట్‌ పెరగడం, రొటీన్‌ కంటెంట్‌ అండ్‌ కామెడీ మూలంగా బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అక్షయ్‌కుమార్‌ నటించిన కేసరి ఛాప్టర్‌2, జాలీ ఎల్‌ఎల్‌బీ 3 కూడా సరైన కంటెంట్‌, స్క్రీన్‌ప్లే లేక డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకున్నాయి.

రీసెంట్‌గా వచ్చిన లవ్ స్టోరీస్‌ మెట్రో ఇన్ దినో యావరేజ్‌ టాక్‌ తెచ్చుకోగా, దడక్ 2కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ సైయారా ముందు తేలిపోయింది. ఇలా అప్పట్లో సక్సెస్‌ సాధించిన క్లాసిక్స్‌కి సీక్వెల్స్ చేసి చేతులు కాల్చుకుంటున్నారు మేకర్స్‌. ఆ తర్వాత సెప్టెంబర్ 5న రిలీజైన టైగర్ ష్రాఫ్ బాఘీ4 కూడా కనీస స్థాయిలో కలెక్షన్లు సాధించలేక చతికిలబడింది. ఇంతకుముందు వచ్చిన భాఘీ సిరీస్‌ మూవీస్‌ యాక్షన్‌ కమ్‌ లవ్‌ స్టోరీతో సక్సెస్‌ చూడగా భాఘీ4 మాత్రం కేవలం యాక్షన్‌కు మాత్రమే పరిమితం కావడం యాక్షన్‌లో కూడా విపరీతమైన రక్తపాతంతో కూడిన వయోలెన్స్‌ ఉండడంతో ప్రేక్షకులు ఆదరించలేదు.

Also Read : TheRajaSaab : రాజాసాబ్ నాన్ థియేట్రికల్ రూమర్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నిర్మాత విశ్వప్రసాద్

తెలుగు మర్యాద రామన్న రీమేక్‌గా అజయ్ దేవగణ్ హీరోగా వచ్చిన సన్‌ ఆఫ్‌ సర్ధార్‌ బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ హిట్‌ అందుకుంది. 13 ఏళ్ల తర్వాత దీనికి సీక్వెల్‌గా సన్‌ఆఫ్‌ సర్ధార్‌2 తెరకెక్కింది. అజయ్‌ దేవగన్‌, మృణాల్‌ ఠాకూర్‌ కాంబినేషన్‌ వర్కౌట్‌ కాలేదు. అలాగే మొదటి సినిమాలో ఉన్న కథ, కామెడీ ఫ్యామిలీ ఎమోషన్స్‌ పండించడంలో మేకర్స్‌ సక్సెస్‌ కాలేకపోయారు. దీంతో సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. దే దే ప్యార్ దే 2 అజయ్ దేవగణ్ సినిమా అయినప్పటికీ, మొదటి భాగంలో ఉన్న మ్యాజిక్‌ను రీక్రియేట్ చేయలేక బిలో యావరేజ్‌గా నిలిచింది. అలాగే అడల్ట్‌ కామెడీ బేస్‌గా వచ్చిన మస్తీ 4, వల్గారిటీ డోస్‌ ఎక్కువవడంతో కనీసం రూ. 15 కోట్లు కూడా వసూలు చేయలేక డిజాస్టర్‌గా మారింది.

Exit mobile version