Crime Comedy Movie : మనుషులను బురిడీ కొట్టించే గొర్రెల మంద… హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్న క్రైమ్ కామెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime Comedy Movie : పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకునే ఒక వినూత్నమైన హాలీవుడ్ మూవీ థియేటర్లలో మంచి టాక్ తో నడుస్తోంది. మిస్టరీ, కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా ఆకట్టుకుంటోంది. ఈ మూవీ హాలీవుడ్ క్లాసిక్ సినిమాలైన “బేబ్ (Babe)”, మైండ్ బ్లోయింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ “నైవ్స్ అవుట్’ (Knives Out) తరహాలో సాగుతుంది. ఇందులో ఒక గొర్రెల కాపరి అనుమానాస్పదంగా చనిపోతే, అతని మందలోని తెలివైన గొర్రెలన్నీ కలిసి ఆ మిస్టరీని ఎలా చేదిస్తాయనేదే కథ. అత్యంత ఆధునిక కంప్యూటర్ గ్రాఫిక్స్ తో రూపొందించిన ఈ సినిమా, అటు ఉత్కంఠభరితమైన ఇన్వెస్టిగేషన్ తో పాటు, ఇటు పొట్ట చెక్కలయ్యే కామెడీతోనూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది.
త్వరలోనే ఓటీటీలోకి
ప్రపంచవ్యాప్తంగా 2026 మే 8 థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా పేరు ‘ది షీప్ డిటెక్టివ్స్’ (The Sheep Detectives). సుమారు $75 మిలియన్ల (రూ. 620 కోట్లకు పైగా) బడ్జెట్తో అమెజాన్ MGM స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం, విడుదలైన కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా $87.8 మిలియన్లకు పైగా వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది. విమర్శకుల నుండి కూడా ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రముఖ రివ్యూ వెబ్సైట్ రోటెన్ టొమాటోస్లో దీనికి 95% రేటింగ్ కూడా లభించింది. థియేటర్ రన్ ముగిసిన తర్వాత ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీ ప్లాట్ఫార్మ్లో స్ట్రీమింగ్ కానుంది. టెక్నికల్ గా ఈ సినిమా హాలీవుడ్లో ఒక కొత్త మైలురాయిగా నిలిచింది. ఇందులో గొర్రెల పాత్రలను సృష్టించడానికి ఉపయోగించిన కంప్యూటర్ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అత్యంత సహజంగా ఉండి ప్రేక్షకులను కట్టిపడేశాయి. రాబోయే ఆస్కార్ అవార్డుల్లో ఈ చిత్రానికి బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో నామినేషన్ దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
‘ది షీప్ డిటెక్టివ్స్’ సినిమా కథ
ఈ కథ చాలా విచిత్రంగా, సరదాగా సాగుతుంది. ఒక ఊరిలో జార్జ్ అనే గొర్రెల కాపరి ఉండేవాడు. అతనికి తన గొర్రెలంటే ప్రాణం. ప్రతిరోజూ రాత్రి పూట వాటికి రకరకాల డిటెక్టివ్ నవలలు, క్రైమ్ స్టోరీలు చదివి వినిపించేవాడు. అయితే ఆ గొర్రెలన్నీ చాలా తెలివైనవని, అతను చదివే ప్రతి ముక్కా వాటికి అర్థమవుతోందని పాపం ఆ కాపరికి అస్సలు తెలియదు. అలా ఆ గొర్రెల మంద అంతా క్రైమ్ నవలలు వింటూ పెద్ద డిటెక్టివ్ మైండ్స్ లా తయారవుతాయి. అయితే ఒకరోజు హఠాత్తుగా జార్జ్ తన పొలంలోనే అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపిస్తాడు. పోలీసులు వచ్చి ఇదొక ప్రమాదం అని కొట్టిపారేస్తారు.
అయితే తమ యజమానిని ఎవరో ప్లాన్ ప్రకారం చంపేశారని ఆ గొర్రెలకు అర్థమవుతుంది. దాంతో జార్జ్ కి న్యాయం చేయాలని, హంతకుడిని ఎలాగైనా పట్టుకోవాలని ఆ గొర్రెలన్నీ ఒక టీమ్గా ఏర్పడతాయి. తాము విన్న డిటెక్టివ్ కథల నాలెడ్జ్ మొత్తాన్ని ఉపయోగించి కేసు ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాయి. అప్పటివరకు పచ్చటి మైదానాలకే పరిమితమైన ఆ గొర్రెలు, క్లూస్ వెతుక్కుంటూ మొదటిసారి మనుషుల ప్రపంచంలోకి అడుగుపెడతాయి. మనుషుల ప్రవర్తన, వాళ్ళు చెప్పే అబద్ధాలు, వింత అలవాట్లను చూసి అవి షాక్ అవుతాయి కూడా. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా.. ఒకదానిని ఒకటి కాపాడుకుంటూ, ఎన్నో నవ్వులు పూయించే సాహసాలు చేసి చివరకు ఆ హంతకుడిని ఎలా పట్టుకున్నాయనేదే ఈ సినిమా పూర్తి కథ.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..