యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘ది రాజా సాబ్’ విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది, మారుతి దర్శకత్వంలో హారర్-కామెడీ జోనర్‌లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమా టికెట్ ధరల పెంపు మరియు బెనిఫిట్ షోలకు సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా బెనిఫిట్ షోలకు, తర్వాత పది రోజుల పాటు టికెట్ రేట్లను పెంచుతూ ఒక జీవో జారీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కానీ తెలంగాణలో మాత్రం ఆ జీవో ఇంకా రాలేదు. ఈరోజు రాత్రికే బెనిఫిట్ షోలు, ప్రీమియర్స్ వేయాల్సి ఉండగా ఆ జీవో ఇంకా రాలేదు. అయితే కోర్టు సమయం ముగిశాక ఆ జీవో జారీ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. సాధారణంగా ఏదైనా పెద్ద సినిమాకు ప్రభుత్వం రేట్లు పెంచుతూ జీవో (GO) ఇచ్చిన వెంటనే, కొందరు కోర్టులో పిటిషన్లు దాఖలు చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల బుకింగ్స్ ఆగిపోవడం లేదా చివరి నిమిషంలో చిక్కులు ఎదురవడం వంటివి జరుగుతుంటాయి.
ALso Read:Actress Ramya: మగాళ్లను వీధి కుక్కలతో పోల్చిన నటి.. సోషల్ మీడియాలో రచ్చ!
ఈ ఇబ్బందులను ముందే ఊహించిన ప్రభుత్వం, కోర్టు పనివేళలు ముగిసిన తర్వాతే (సాయంత్రం 5:30 గంటలకు) టికెట్ రేట్ల పెంపు మరియు బెనిఫిట్ షోల అధికారిక ఉత్తర్వులను విడుదల చేసే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. కోర్టు సమయం ముగియడం వల్ల, ఆ రోజున ఎవరూ ఈ జీవోపై స్టే కోరుతూ పిటిషన్ వేసే అవకాశం ఉండదు. తద్వారా ఎలాంటి ఆటంకాలు లేకుండా బుకింగ్స్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. ప్రభుత్వ జీవో వెలువడిన వెంటనే థియేటర్ యాజమాన్యాలు బుక్‌మైషో సహా ఇతర పోర్టల్స్‌లో బుకింగ్స్ జరిగేలా డేటాను అప్‌డేట్ చేస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం, నేడు సాయంత్రం 5:30 నుండి 6:00 గంటల మధ్య ‘ది రాజా సాబ్’ అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తిస్థాయిలో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బెనిఫిట్ షోలకు (అర్ధరాత్రి లేదా తెల్లవారుజాము షోలు) కూడా లైన్ క్లియర్ అయింది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన కేంద్రాలలో ఈ షోల కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం అనుమతి కూడా దాదాపు ఖాయం కావడంతో ఇప్పుడు రికార్డు స్థాయి వసూళ్లపై చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.
