Actress Ramya: మగాళ్లను వీధి కుక్కలతో పోల్చిన నటి.. సోషల్ మీడియాలో రచ్చ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Ramya: నటి రమ్య కన్నడ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన నటి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలకు విరామం ఇచ్చిన ఆమె, ఇప్పుడు క్రియాశీల రాజకీయాలకూ దూరంగా ఉన్నారు. అయితే సినిమాలపై ఆసక్తి మాత్రం తగ్గలేదు. తిరిగి చిత్రరంగంలోకి రావాలనే ప్రయత్నంలో భాగంగా ఓ సినిమా నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించారు. రాజకీయాల నుంచి దూరమైనప్పటికీ, సామాజిక అంశాలపై స్పందిస్తూ యాక్టివ్‌గా ఉంటున్నారు. అయితే.. రమ్య జంతు ప్రేమికురాలు. ముఖ్యంగా మూగజీవుల హక్కుల విషయంలో ప్రత్యేకంగా వీధి కుక్కల సమస్యలపై ఆమె తరచూ తన అభిప్రాయాలను వెల్లడిస్తూ వస్తున్నారు. అవసరం అనిపించిన ప్రతిసారీ జంతువుల తరఫున గళమెత్తడం ఆమెకు కొత్తేం కాదు. గత ఏడాది జూలైలో సుప్రీంకోర్టు వీధి కుక్కల అంశంపై కీలక ఆదేశాలు ఇచ్చింది. వీధి కుక్కలను ఆశ్రయ కేంద్రాల్లో ఉంచాలని సూచించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రమ్యాతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కుక్కల ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుచోట్ల నిరసనలు కూడా జరిగాయి. తాజాగా ఇదే అంశంపై మరోసారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు, వీధి కుక్కలను వాటి ప్రవర్తన ఆధారంగా వర్గీకరించడం సాధ్యం కాదని వ్యాఖ్యానించింది. “ఈ కుక్క కాటేస్తుంది, ఈ కుక్క కాటేయదు అని ముందుగా తెలుసుకోవడం అసాధ్యం. వీధి కుక్కల మూడ్‌ను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు” అంటూ, అందుకే అన్ని కుక్కలను ఆశ్రయ కేంద్రాల్లో ఉంచడమే సరైనదని అభిప్రాయం వ్యక్తం చేసింది.
Also Read
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలపై నటి రమ్యా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె సోషల్ మీడియాలో స్పందిస్తూ ఘాటైన ఉపమానం ఇచ్చారు. “మగాళ్లను కూడా అర్థం చేసుకోవడం చాలా కష్టం. వారు ఎప్పుడు అత్యాచారం చేస్తారో, ఎప్పుడు హత్య చేస్తారో తెలియదు. అలాంటప్పుడు పురుషులందరినీ జైలులో పెట్టేయాలా?” అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య ద్వారా కాటేసే కుక్కలు, సౌమ్యమైన కుక్కలను వేరు చేయడం కష్టం అనే కారణంతో అన్ని కుక్కలను ఆశ్రయ కేంద్రాల్లో ఉంచడం సరైంది కాదని ఆమె స్పష్టం చేశారు. మగాళ్లను కుక్కలతో పోలుస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రమ్యపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రమ్య స్పందన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారి తీస్తోంది. వీధి కుక్కల సమస్యను పురుషులతో పోల్చడంపై చర్చ మొదలైంది.
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!