Green Signal to Bhola Shankar: తమిళంలో అజిత్ నటించిన వేదళం తెలుగులో భోళా శంకర్‌గా రీమేక్ అయింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య వంటి సూపర్‌హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే భోళా శంకర్ సినిమా విడుదలపై ఎట్టకేలకు సందిగ్ధత తొలిగింది. తనకు ఏజెంట్ సినిమా సమయంలో హక్కుల విషయంలో అన్యాయం జరిగిందని, భోళా శంకర్ రిలీజ్ లోపు తనకు డబ్బులు విషయంలో ఏదో ఒక క్లారిటీ ఇస్తానని చెప్పారని ఇప్పుడు ఫోన్ ఎత్తడం లేదని వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సతీష్ కోర్టును ఆశ్రయించారు. ఇక నిన్న ఈ కేసులో వాదనలు జరుగగా ఈ రోజుకు వాయిదా వేశారు. ఇక ఈ క్రమంలో మరోసారి భోళా శంకర్ సినిమా విడుదలపై సివిల్ కోర్టులో వాదనలు జరిగాయి. ఏజెంట్ సినిమాలో నగదు లావీదేవీలలో వివాదంపై సివిల్ కోర్టులో వాదనలు జరగగా జడ్జి అడిగిన క్లారిఫికేషన్లపై వాదనలు వినిపించారు ఇరు వర్గాల న్యాయవాదులు.
Telugu OTT Releases This Week: మూవీ లవర్స్ కి పండగే.. ఈ వారం ఓటీటీలో సినిమాల జాతర!
ఏజెంట్ సినిమాతో రూ.30 కోట్ల నష్టం వాటిల్లిందని ఏ.కే ఎంటర్టైన్మెంట్స్ వాదించగా తమకు రావాల్సిన రూ. 28.30 కోట్లు చెల్లించాలని గాయత్రి ఫిలిమ్స్ తరపున న్యాయవాది వాదించారు. ఈ క్రమంలో భోళా శంకర్ కు కోర్టు క్లియరెన్స్ లభించింది. భోళా శంకర్ సినిమా విడుదల కు లైన్ క్లియర్ చేస్తూ గాయత్రి ఫిలిమ్స్ (సతీష్ ) పిటీషన్ డిస్మిస్ చేసింది సిటీ సివిల్ కోర్టు. ఇక సినిమా విషయానికి వస్తే భోళా శంకర్‌పై వున్న భయాన్ని తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ పోగొట్టింది. చిరంజీవి హీరో… చెల్లిగా కీర్తిసురేష్.. హీరోయిన్గా తమన్నా అంటే సినిమా ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. తమిళంలో హిట్టయిన చెల్లి సెంటిమెంట్ స్టోరీ అంటే మినిమం గ్యారెంటీ, అయితే సినిమా కాస్టింగ్ ఎంత ఎట్రాక్టీవ్‌గా వున్నా.. దర్శకుడు మెహర్ రమేశ్‌కు సరైన హిట్ లేకపోవడంతో.. మెగాఫ్యాన్స్కు వున్న అనుమానాలను ట్రైలర్ పోగొట్టింది. వాల్తేరు వీరయ్య హిట్ కావడంతో…చిరంజీవిని ఫ్యాన్సే కాదు.. అందరూ ఎలా చూడాలనుకుంటారో.. అలాగే భోళా శంకర్‌ను ట్రైలర్‌ను కట్ చేశాడు. వాల్తేరు వీరయ్య మాదిరి యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా వుంటుందని ట్రైలర్‌తో చెప్పేశారు. వెరైటీగా లేకపోయినా.. కమర్షియల్ హంగులతో ట్రైలర్ ఆకట్టుకుంది.