Aaya Sher: షేర్ ఆగయా.. చార్ట్ బస్టర్ లోడింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, విజనరీ మేకర్ శ్రీకాంత్ ఓదెల బిగ్ కాన్వాస్‌పై బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ ది ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నారు. SLV సినిమాస్ ఆధ్వర్యంలో సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని ప్రపంచ స్థాయి స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ ప్రోమో వైరల్ అయ్యింది, అంచనాలను భారీగా పెంచింది. ఇప్పుడు విడుదలైన ఫుల్ ట్రాక్ తో రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అంచనాలని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళాడు. ట్రైబల్ పర్కషన్‌తో పాటు గ్రిటీ ఎలక్ట్రానిక్ సౌండ్స్‌ను కలిపి, ప్రైమల్ ఎనర్జీతో నిండిన థండరస్ మ్యూజిక్ ఎక్స్ పీరియన్స్ అందించాడు. సెలబ్రేషన్, అడ్రినలిన్ రెండింటి మేళవింపుగా ఈ పాట అదిరిపోయింది.
Also Read:Made in Korea : మార్చి 12న నెట్‌ఫ్లిక్స్ లో ‘మేడ్ ఇన్ కొరియా’
Also Read
- Ajith Kumar: అజిత్‌తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
- Theaters issue : ఈ వారమే థియేటర్ వార్‌కు అసలు పరీక్ష.. డిస్ట్రిబ్యూషన్ పవరా? ప్రేక్షకుల డిమాండా?
- Alpha OTT: అలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
- No Release Date : ఈ సినిమాలు వచ్చేది ఎప్పుడు.. అసలు వస్తాయా?
కాసర్ల శ్యామ్ రాసిన సాహిత్యం “షేర్” రాకను సూచిస్తూ ఆకలి, ఆధిపత్యం, టెర్రిటోరియల్ పవర్‌తో నిండిన అంథమ్లా వినిపిస్తుంది. ప్రముఖ తెలంగాణ జానపద గాయకులు అడ్డుల జంగిరెడ్డి, అకునూరి దేవయ్య తమ శక్తివంతమైన వోకల్స్ తో పాటను మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. నాని ట్రాన్స్ఫర్మేషన్ ఈ పాటలో హైలెట్ గా నిలిచింది. జడలతో కూడిన హెయిర్ స్టైల్, గడ్డం, రెడ్ బ్లేజర్‌తో రగ్గడ్ లుక్‌లో ఆయన వారియర్, ఐకాన్‌లా కనిపిస్తున్నారు. నాయకుడిగా ఆయన స్వాగ్ అదిరిపోయింది. సుధన్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకు మరింత మ్యాడ్ ఎనర్జీని జోడించింది. నాని డాన్స్ అదిరిపోయింది. హుక్ స్టెప్ నుంచి ఫ్లోర్ మూవ్స్ వరకు అన్నీ వైరల్ అవుతున్నాయి. బిర్యానీ హాండీలతో వచ్చే ఎంట్రీ నుంచి చివర్లో సింహాసనంపై కూర్చునే ఎగ్జిట్ వరకు ప్రతి ఫ్రేమ్ లో ఆయన ప్రెజెన్స్ నెక్స్ట్ లెవల్ లో వుంది.
Also Read:The Kerala Story 2: “ది కేరళ స్టోరీ 2’కు సెన్సార్ షాక్: ఏకంగా 16 కట్స్!
శ్రీకాంత్ ఒడెల ఇక్కడ సృష్టించిన విజువల్ యూనివర్స్ అద్భుతంగా, రఫ్‌గా కనిపిస్తున్నాయి. భారీ స్థాయి, ఇంటిమేట్ ఎమోషన్స్ రెండింటినీ కలిపిన ఈ వరల్డ్, ఈ జానర్లో ఇప్పటివరకుఎన్నడూ చూడడని అద్భుతంగా కనిపిస్తోంది. ఎస్ఎల్వీ సినిమాస్ వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ విల్యూస్ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తున్నాయి. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా చేసిన విజువల్ డీటైలింగ్ ప్రత్యేకంగా నిలిచింది. అనిరుధ్ రవిచందర్ ఆల్బమ్‌ను వైరల్ బ్యాంగర్తో ప్రారంభించగా, మిగతా పాటలపై అంచనాలు ఇప్పుడు నెక్స్ట్ లెవల్ కి చేరాయి. ఈ సినిమాలో మోహన్ బాబు, బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయాల్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “ది ప్యారడైజ్ ” చిత్రం ఆగస్టు 21న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో పాన్ వరల్డ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
తాజావార్తలు
-
Ajith Kumar: అజిత్‌తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
-
Theaters issue : ఈ వారమే థియేటర్ వార్‌కు అసలు పరీక్ష.. డిస్ట్రిబ్యూషన్ పవరా? ప్రేక్షకుల డిమాండా?
-
Monday Horoscope: వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరికి..? నేటి ద్వాదశ రాశుల పూర్తి సమాచారం ఇలా.!
-
Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్.. అసలు ఏం జరిగిందంటే?
-
Alpha OTT: అలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!