Kingdom : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. మే 30 నుంచి జులై 4వ తేదీకి ఈ మూవీ వాయిదా పడిపోయింది. కాగా ఈ మూవీ గురించి ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది. తాజాగా మూవీని లాక్ చేసినట్టు విజయ్ దేవరకొండ స్వయంగా ప్రకటించాడు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నాడు విజయ్. సినిమా సెట్స్ లో విజయ్, డైరెక్టర్ స్టిల్స్ ను కూడా పోస్ట్ చేశాడు. విజయ్ కు డైరెక్టర్ సీన్ వివరిస్తున్న ఫొటోలాగా కనిపిస్తోంది. ఈ ఫొటోలో విజయ్ లుక్ అదిరిపోయింది.
Read Also : Hari Hara Veera Mallu: హైపెక్కిస్తారట రెడీగా ఉండండి!
విజయ్ ను ఇన్ని రోజులు ఎలాంటి లుక్ లో చూడాలని అంతా అనుకున్నారో.. ఇప్పుడు అలాగే కనిపిస్తున్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. కింగ్ డమ్ జులై 4న రాబోతున్న సందర్భంగా వచ్చే నెల జూన్ నుంచి వరుసగా ప్రమోషన్లు స్టార్ట్ చేయబోతున్నారు. పాన్ ఇండియా వ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంట. ఈ మూవీతో ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని విజయ్ వెయిట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జనరుగుతున్నాయి. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
Read Also : Ileana : పాపం.. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ఇలియానా
Locked in. #KINGDOM In 50.
4th July, 2025. pic.twitter.com/ZM9RAcpsa2
— Vijay Deverakonda (@TheDeverakonda) May 15, 2025