కాశ్మీర్ ఫైల్స్ తర్వాత ఇండియాలో ఆ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సినిమా ‘ది కేరళ స్టొరీ’. అదా శర్మ మెయిన్ రోల్ ప్లే చేసిన ‘ది కేరళ స్టొరీ’ సినిమా ఇండియాలో సెన్సేషనల్ బాక్సాఫీస్ రన్ ని మైంటైన్ చేస్తోంది. వివాదాలు అడ్డొచ్చినా, రాష్ట్రాలకి రాష్ట్రాలే సినిమాని బాన్ చేసినా కలెక్షన్స్ మాత్రం రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. సెకండ్ మండే కూడా 10 కోట్లు రాబట్టింది అంటే కేరళ స్టొరీ ఎలాంటి హోల్డ్ ని మైంటైన్ చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. రోజు రోజుకీ కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి కానీ ఇప్పటివరకూ ది కేరళ స్టొరీ కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించలేదు. డే 1 కన్నా డే 10 ఎక్కవ కలెక్షన్స్ ని రాబట్టి ట్రేడ్ వర్గాలు కూడా ముక్కున వేలేసుకునేలా చేస్తుంది ది కేరళ స్టొరీ సినిమా. ప్రాపగెండానా లేదా ఇంకోకటా అనేది పక్కన పెడితే ఒక లేడీ ఓరియెంటెడ్ చిన్న సినిమా, కేవలం 16 కోట్ల బడ్జట్ తోనే రూపొందిన సినిమా… ఈరోజు వారం తిరిగే లోపు 82 కోట్లు, రెండో వారం ఎండ్ అయ్యే లోపు 150 కోట్ల బెంచ్ మార్క్ ని రీచ్ అవ్వడం గొప్ప విషయమే.
ఈరోజు, రేపు ది కేరళ స్టొరీ ఇదే జోష్ ని మైంటైన్ చేస్తే చాలు… మళ్లీ వీకెండ్ వచ్చేస్తుంది కాబట్టి కలెక్షన్స్ మళ్లీ పుంజుకుంటాయి. నెక్స్ట్ మండే లోపు ది కేరళ స్టొరీ సినిమా 200 కోట్ల మార్క్ ని చేరుకోవడం గ్యారెంటీ. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ది కేరళ స్టొరీ ఓవరాల్ థియేట్రికల్ రన్ లో 250 కోట్ల వరకూ రాబట్టే అవకాశం ఉంది. తమిళనాడు, కేరళ, వేస్ బెంగాల్ లాంటి ప్రాంతాల్లో ది కేరళ స్టొరీ సినిమాని ఎంతగా ప్రభుత్వాలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుంటే మధ్య ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ లాంటి రాష్ట్ర ప్రభుత్వాలు ది కేరళ స్టొరీ సినిమాకి అంతే అండగా నిలుస్తూ టాక్స్ ఫ్రీ చేసి మరీ ది కేరళ స్టొరీ సినిమాని చూడమని ప్రమోట్ చేస్తున్నాయి. లేటెస్ట్ గా ది కేరళ స్టొరీ సినిమా ఓవర్సీస్ లో కూడా రిలీజ్ అయ్యింది కాబట్టి అక్కడ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.