Site icon NTV Telugu

The Kashmir Files Trailer : బ్రూటల్లీ హానెస్ట్ స్టోరీ

టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ తమ తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం వివాదాస్పద అంశాన్ని ఎంచుకుంది. “ది కాశ్మీర్ ఫైల్స్” అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రానికి వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించి, సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మేకర్స్ ఈరోజు ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఎమోషనల్‌గా, క్రూరమైన నిజాయితీగా, హార్డ్ హిట్టింగ్‌గా కనిపిస్తోంది. కాశ్మీర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య చిక్కుకున్న కాశ్మీరీల సున్నితమైన అంశాలతో తెరకెక్కింది. ఇందులో అనుపమ్ ఖేర్ వంటి ప్రముఖ తారలు ఉండటం ఆసక్తికరంగా ఉంది. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న థియేటర్‌లో విడుదల కానుంది.

Read Also : Prabhas Treat : జీర్ణించుకోలేం అంటూ బిగ్ బీ పంచులు

ట్రైలర్ పై టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సోషల్ మీడియా ద్వారా రివ్యూ ఇచ్చారు. “డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి, ఈ చిత్రాన్ని నిర్మించినందుకు నా నిర్మాత (అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్)కు హ్యాట్సాఫ్… కాశ్మీర్ మారణహోమానికి సంబంధించిన క్రూరమైన నిజాయితీ కథకు సాక్షి… #TheKashmir Files Trailer… మార్చి 11న థియేటర్‌లలో విడుదల కానుంది. #న్యాయానికి హక్కు” అంటూ నిఖిల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్న “కార్తికేయ2” చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు.

Exit mobile version