టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ తమ తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం వివాదాస్పద అంశాన్ని ఎంచుకుంది. “ది కాశ్మీర్ ఫైల్స్” అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రానికి వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించి, సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మేకర్స్ ఈరోజు ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఎమోషనల్‌గా, క్రూరమైన నిజాయితీగా, హార్డ్ హిట్టింగ్‌గా కనిపిస్తోంది. కాశ్మీర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం భారత్-పాకిస్థాన్‌ల మధ్య చిక్కుకున్న కాశ్మీరీల సున్నితమైన…