The Ghost Release Trailer: అక్కినేని నాగార్జున, సోనాల్ చౌహన్ జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది ఘోస్ట్. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సునీల్ నారంగ్ – పుస్కుర్ రామ్ మోహన్ రావు – శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. “ఇంతకీ ఎవడాడు.. ఘోస్ట్” అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమయ్యింది. ఇంటర్ పోల్ ఆఫీసర్ గా ఘోస్ట్ గా నాగ్ లుక్ అదిరిపోయింది. తన అక్క కూతురు ను కాపాడడానికి మాఫియాతో తలపడిన ఇంటర్ పోల్ ఆఫీసర్.. తన ఉద్యోగం గురించి ఎవరికి చెప్పకుండా ఘోస్ట్ గా అవతరమెత్తి మాఫియాను మట్టి కరిపించి మేనకోడలిని రక్షించడమే ఘోస్ట్ కథగా తెలుస్తోంది.
చిన్నతనంలో విడిపోయిన అక్క.. కూతురు కోసం తమ్ముడి హెల్ప్ అడగడం, తనతో ఉన్న విబేధాలను పక్కన పెట్టి అక్క కూతురు కోసం ఘోస్ట్ గా మారడం ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఇక ఘోస్ట్ గా మాఫియాను ఊచకోత కోస్తున్న నాగ్ ను చూస్తుంటే గూస్ బంప్స్ రావడం ఖాయం. ఇక మధ్యలో నాగ్, సోనాల్ మధ్య రొమాన్స్ అదిరిపోయింది. డబ్బు, సక్సెస్ సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తోంది అనే డైలాగ్ ఆకట్టుకొంటుంది. ఇక భరత్ సురభ్- మార్క్ రాబిన్ సంగీతం హైలైట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి ఈ సినిమా నాగ్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.