Thangalaan: విక్రమ్.. అదును చూసి దింపుతున్నాడే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thangalaan: సంక్రాంతి.. సంక్రాంతి.. సంక్రాంతి.. ప్రస్తుతం సినీ ప్రేక్షకుల అందరి చూపు సంక్రాంతిమీదనే ఉంది. ఒకటా.. రెండా.. దాదాపు పెద్ద సినిమాలు అన్ని సంక్రాంతికే ఉన్నాయి. వీటితో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా యాడ్ అవ్వడంతో ఈ సంక్రాంతి మరింత రసవత్తరంగా సాగనుంది. ఇప్పటికే గుంటూరు కారం, ఫ్యామిలీ స్టార్, సైంధవ్, హనుమాన్ తో పాటు ఈగల్ కూడా రావడానికి ప్రయత్నిస్తోంది. ఇవన్నీ ఇలా ఒకేసారి రావడానికి కారణం.. సలార్ డిసెంబర్ లో రావడమే. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఇంకో స్టార్ సినిమా కు వస్తుంది అనుకున్నారు. అదే తంగలాన్. చియాన్ విక్రమ్, మాళవిక మోహనన్ జంటగా పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా మొదటి నుంచి కూడా సంక్రాంతికే వస్తుంది అనుకున్నారు.
Varun- Lavanya: మెగా ఇంటి కోడలు.. లుక్ మొత్తం మార్చేసినట్టుందే
Also Read
- Vadivelu : ఆ మూడో వ్యక్తి వల్లే ధనుష్‌తో నాకు గొడవలు!
- Alia Bhat : రూటు మార్చేసిన భన్సాలీ ..స్లిట్ స్కర్ట్, మునుపెన్నడూ చూడని గ్లామర్!
- Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన 'హాయ్'!
- TV Nandi Awards: తిరుపతి వేదికగా 'నంది' అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ముఖ్యంగా విక్రమ్ ఈ సినిమా కోసం పడిన కష్టం మాములు విషయం కాదు. ఆ లుక్ చూస్తే ఎవరైనా భయపడడం ఖాయమే అని చెప్పొచ్చు. ఇక సంక్రాంతికి ఇన్ని సినిమాలు ఉండడంతో విక్రమ్ కొద్దిగా ముందుకు వెళ్ళాడు. రిపబ్లిక్ డే రోజున తంగలాన్ ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నిజం చెప్పాలంటే.. విక్రమ్ ఈ రిలీజ్ డేట్ ను ఎంచుకొని మంచి పనే చేశాడు అని చెప్పాలి. ఆ రోజున తంగలాన్ తో పోటీపడే సినిమాలు లేవు కాబట్టి.. సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ఇక నవంబర్ 1 న టీజర్ రిలీజ్ తో సినిమాపై మరింత హైప్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏదిఏమైనా అదును చూసే విక్రమ్ సినిమాను దింపుతున్నాడు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో విక్రమ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి .
తాజావార్తలు
-
World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
-
CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
-
High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!