Thandel Key Scene to be shot on 11th march: నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా తండేల్ అనే సినిమా తెరకెక్కుతోంది. చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. గతంలో శ్రీకాకుళం జిల్లా నుంచి గుజరాత్ వెళ్లి అక్కడి నుంచి బోట్లలో పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లి పట్టుబడిన కొందరు మత్స్యకారుల నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. అలా వెళ్లి పాకిస్తాన్ జైల్లో కొన్నాళ్లపాటు శిక్ష అనుభవించిన వ్యక్తిగా నాగచైతన్య కనిపిస్తున్నాడు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అందరిలో ఆసక్తి నెలకొంది కానీ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఒక వీడియో సినిమా మీద ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. పాకిస్తాన్ జైలులో కొన్నాళ్లు జైలు జీవితం గడిపి శ్రీకాకుళం తిరిగి వచ్చిన వ్యక్తిగా నాగచైతన్య కనిపిస్తూ ఉండగా ప్రస్తుతానికి సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
RGV: శపథం.. నాలుగు గోడల మధ్య జరిగిన యదార్ధ సంఘటన
ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ శివారులో ఉన్న బీహెచ్ఈఎల్ లో వేసిన ప్రత్యేకమైన పాకిస్తాన్ జైలు సెట్ లో జరుగుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకి సంబంధించిన ఒక కీలక సీక్వెన్స్ షూటింగ్ 11వ తేదీన జరుగనుంది. ఒక కీలకమైన ఘట్టాన్ని ఆరోజు షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఆ రోజు పాకిస్తాన్ నుంచి తిరిగి వచ్చి భారతదేశంలోని ఒక రైల్వే స్టేషన్ లో దిగుతున్న షూట్ చేస్తున్నారని, అది సినిమా మొత్తానికి కీలకమైన ఘట్టంగా చెబుతున్నారు. ఆ రోజు రామచంద్రాపురం రైల్వే స్టేషన్ లో జరిగే షూట్ కి సాయి పల్లవి సహా సినిమాల్లో కీలకమైన పాత్రధారులు అందరూ హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని వీలైనంత రియలిస్టిక్ గా తెరకెక్కించడానికి దర్శక నిర్మాతలు తమ వంతు ప్రయత్నం తాము చేస్తున్నారు.