Site icon NTV Telugu

Thaman : వర్షమా బొక్కా.. తమన్ ఏంటీ కామెంట్లు

Ss Thaman

Ss Thaman

Thaman : మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంట్రవర్సీ కామెంట్లు చేశాడు. పవన్ కల్యాణ్‌ హీరోగా వస్తున్న ఓజీ సినిమా కాన్సర్ట్ ప్రోగ్రామ్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు. ఈవెంట్ స్టార్టింగ్ నుంచే వర్షం పడటం స్టార్ట్ అయింది. స్టేజి మీదకు వచ్చిన తమన్.. వర్షమా బొక్కా.. ఏం జరిగినా ఇక్కడే ఉంటాం అన్నాడు. ఈ కామెంట్లపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. కొన్ని చోట్ల వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతుంటే.. నీకు వర్షం అంటే అంత చిన్న చూపుగా ఉందా అంటూ ఏకి పారేస్తున్నారు.

Read Also : OG : సుజీత్ తో సినిమా చేయడానికి కారణం ఆ డైరెక్టరే : పవన్

ప్రకృతి తలచుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో చూడట్లేదా.. వర్షాలు పడితే నగరాలే కొట్టుకుపోతున్నాయి. అదే వర్షం పడకపోతే పంటలు ఎండిపోయి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అలాంటి వర్సం మీద ఇలాంటి కామెంట్లు ఏంటని మండిపడుతున్నారు నెటిజన్లు. వర్షం నీకు అవసరం లేదేమో కానీ.. కోట్ల మంది రైతులకు, ప్రజలకు అవసరమే అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి తమన్ చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. మరి దీనిపై తమన్ ఏమైనా స్పందిస్తాడా లేదా అన్నది చూడాలి.

Read Also : Idiot : ఇండస్ట్రీ హిట్ మిస్ చేసుకున్న పవన్ కల్యాణ్‌.. అది చేసుంటే వేరే లెవల్..

Exit mobile version