ప్రభాస్, పూజ హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”. మరికొన్ని గంటల్లో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి రెడీగా ఉన్న ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. యూరప్ నేపథ్యంలో సాగే ఈ బహుభాషా ప్రేమకథ 1970ల నేపథ్యంలో సాగుతుంది. ప్రభాస్ విక్రమాదిత్యగా, హస్తసాముద్రికుడిగా, విక్రమాదిత్య లవర్ ప్రేరణగా పూజాహెగ్డే కనిపించనుంది. ఈ చిత్రం మార్చి 11న థియేటర్లలోకి రానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, చైనీస్, జపనీస్ భాషల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీకి థమన్ కూడా మ్యూజిక్ అందించారు. అయితే ఆయన ఈ సినిమా సంగీతంలో పాలు పంచుకోవడానికి స్పెషల్ రీజనే ఉందట.
Read Also : Chiranjeevi : ఆ తెలుగు వైద్యుడి కోసం మెగాస్టార్ ఎమోషనల్
తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో థమన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. “2016లో నేను ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాను. ఆ సమయంలో వంశీ ప్రమోద్ ‘భాగమతి, మహానుభావుడు’ అనే రెండు చిత్రాలతో నాకు సహాయం చేశాడు. అదే నాకు ‘తొలిప్రేమ’ సినిమాని తెచ్చిపెట్టింది. చివరికి ‘అరవింద’ అవకాశం కూడా పట్టేయగలిగాను. నాకు అవసరం వచ్చినప్పుడు వంశీ, ప్రమోద్‌లు నాకు సపోర్ట్ ఇచ్చారు. అతనికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం నా బాధ్యత. కాబట్టి కమర్షియల్‌గా పెద్దగా ఆలోచించకుండా 33 రోజులు కంటిన్యూగా ఈ సినిమాకు పని చేశాను’’ అని థమన్ ఓపెన్‌గా చెప్పాడు.