SS Thaman : గేమ్ ఛేంజర్ పాటల మీద తమన్ సంచలన కామెంట్లు చేశాడు. రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ భారీ సినిమాలో సాంగ్స్ కోసం వేసిన సెట్స్ బాగా హైలెట్ అయ్యాయి. కేవలం పాటల కోసమే రూ.70 కోట్ల దాకా ఖర్చు చేశామంటూ దిల్ రాజు పదే పదే చెప్పడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయింది. కానీ అనుకున్న స్థాయిలో పాటలు ఆకట్టుకోలేకపోయాయి. తాజాగా తమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ పాటల ఫెయిల్యూర్ పై క్లారిటీ ఇచ్చాడు.
Read Also : Sanju Samson: గాయం నుంచి కోలుకుని జట్టులో చేరిన ఆర్ఆర్ కెప్టెన్..
‘చాలా మంది గేమ్ ఛేంజర్ పాటల ఫెయిల్యూర్ కు నాదే కారణం అనుకుంటున్నారు. కానీ అసలు కారణం నేను కాదు. ఎందుకంటే ఈ సాంగ్స్ లో ఒక్క హుక్ స్టెప్ కూడా లేదు. ఒక పాటకు తగ్గట్టు అందులో ఆకట్టుకునే స్టెప్పులు ఉన్నప్పుడే అది బాగా వైరల్ అవుతుంది. గతంలో నేను సాంగ్స్ చేసిన చాలా సినిమాల్లో హుక్ స్టెప్స్ ఉన్నాయి. అందుకే అవి బాగా వైరల్ అయ్యాయి. అల వైకుంఠపురంలో పాటలు బాగా హిట్ అవ్వడానికి మ్యూజిక్ తో పాటు హుక్ స్టెప్స్ కారణం. కానీ గేమ్ ఛేంజర్ లో అది మిస్ అయింది. నేను మ్యూజిక్ ద్వారా ప్రతి పాటకు 20 మిలియన్లకు పైగా వ్యూస్ తీసుకురాగలను. కానీ అంతకు మించి ఆడాలంటే అదిరిపోయే స్టెప్పులు ఉండాలి. ఆ స్టెప్పు మీద సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు వస్తే రీచ్ ఎక్కువగా ఉంటుంది. అది కొరియోగ్రాఫర్ మీదనే ఆధారపడి ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు తమన్. ఇంతకీ తమన్ ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్లు చేశాడా అని అంతా ఆరా తీస్తున్నారు.