Site icon NTV Telugu

Thaman : అడ్రస్ పెట్టురా వచ్చి నేర్చుకుంటా.. థమన్ ఫైర్..!

Thaman

Thaman

Thaman : మ్యూజిక్ డైరెక్టర్ థమన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. మ్యూజిక్ అంటే ఎంత ఇష్టమో.. క్రికెట్ అంటే కూడా థమన్ కు అంతే ఇష్టం. సెలబ్రిటీ క్రికెట్ లో కచ్చితంగా ఆడుతుంటాడు. తాజాగా క్రికెట్ విషయంలో ఓ నెటిజన్ మీద ఫైర్ అయ్యాడు థమన్. గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్న వీడియోను పోస్ట్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్. బౌలర్ వేసిన బాల్ ను సిక్స్ కొట్టాడు థమన్. ఆ వీడియోకు ‘షార్ట్ వేయకు బ్రో’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోను చూసిన ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

Read Also : Kannappa : కన్నప్ప టీమ్ పై జీఎస్టీ సోదాలు.. మంచు విష్ణు సహా..

‘షార్ట్ కు, స్లాట్ కు తేడా తెలియనప్పుడే అర్థం అయింది నువ్వు ధోనీ ఫ్యాన్ అని’ అంటూ కామెంట్ చేశాడు. దానికి థమన్ సీరియస్ గా రిప్లై ఇచ్చాడు. ‘ఓకే రా అడ్రస్ పెట్టు వచ్చి నేర్చుకుంటా’ అంటూ ఇచ్చి పడేశాడు. ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. సాధారణంగా థమన్ ఇంత సీరియస్ గా రిప్లై ఇవ్వడు. కానీ నెటిజన్ చేసిన కామెంట్ కు ఇలా రిప్లై ఇవ్వడంతో అది కాస్త వైరల్ అవుతోంది.

థమన్ చేసిన పోస్టుకు సదరు నెటిజన్ కూడా స్పందించారు. థాంక్యూ టెడ్డీ అన్నా.. ఓజీతో సిక్సర్ కొట్టు అంటూ చెప్పాడు. వీరిద్దరూ ఇలా రిప్లై ఇచ్చుకోవడం చూసి అంతా రకరకాల కామెంట్స్ చేస్తున్నాడు. తమన్ ప్రస్తుతం అఖండ-2, ఓజీకి మ్యూజిక్ అందిస్తున్నాడు.

Read Also : Mahesh Babu : అనగనగా మూవీపై మహేశ్ బాబు ప్రశంసలు..

Exit mobile version