NTV Telugu Site icon

Varisu: రంజితమే తెలుగు వర్షన్ వచ్చేస్తోంది..!!

Ranjitame

Ranjitame

Varisu: దళపతి విజయ్ నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘వారిసు/వారసుడు’. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు. సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అవనున్న ఈ మూవీ ప్రమోషన్స్ కి మొదలుపెట్టిన చిత్ర యూనిట్, ‘వారిసు’ సినిమా నుంచి ‘రంజితమే’ సాంగ్ ని రిలీజ్ చేశారు. తమన్ కంపోజ్ చేసిన ఈ పాట ఇప్పటివరకు 70 మిలియన్ వ్యూస్ రాబట్టి చార్ట్ బస్టర్ అయ్యింది. అయితే ‘వారిసు’ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది కదా మరి తమిళ వర్షన్ పాటని రిలీజ్ చేసి చాలా రోజులు అవుతున్నా తెలుగు వర్షన్ లో ‘రంజితమే’ పాటని ఎందుకు విడుదల చేయలేదని అంతా అయోమయంలో పడ్డారు. ఈ డౌట్స్ కి ఎండ్ కార్డ్ వేస్తూ ‘రంజితమే’ తెలుగు వర్షన్ ని నవంబర్ 30న  ఉదయం 9:09 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

తమిళ్ వెర్షన్ ‘రంజితమే’ పాటని హీరో విజయ్, సింగర్ ఎమ్.ఎమ్ మానసి పాడారు. తెలుగులో రంజితమే పాటకి రామజోగయ్య శాస్త్రీ లిరిక్స్ రాయగా అనురాగ్ కులకర్ణీ, ఎమ్.ఎమ్ మానాసి పాడారు. ‘ఆశా పాశం’, ‘మహానటి’, ‘నీ చిత్రం చూసి’ లాంటి సూపర్ హిట్ సాంగ్స్ పాడిన అనురాగ్ కులకర్ణీ పాడడం ‘రంజితమే’ తెలుగు వర్షన్ కి కలిసొచ్చే విషయం. రంజితమే తెలుగు వర్షన్ రిలీజ్ చేస్తున్నాం అని చెప్పడంతో, దిల్ రాజు అండ్ టీం ‘వారసుడు’ ప్రమోషన్స్ ని మొదలుపెట్టినట్లు అయ్యింది. అయితే ఈసారి నుంచి తెలుగు తమిళ వర్షన్ కి ఇంత గ్యాప్ ఉండకుండా రెండు పాటలని ఒకేసారి రిలీజ్ చేస్తే సినిమాకి ఇంకా ఎక్కువ రీచ్ వచ్చే ఛాన్స్ ఉంది.