ఇళయ దళపతి విజయ్, టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘లియో’ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చైన్నైలో గ్రాండ్‌గా ఆడియో లాంచ్ ఈవెంట్ చేయాలనుకున్నారు మేకర్స్ కానీ పొలిటికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈవెంట్ క్యాన్సిల్ చేశారు. దీంతో లియో రాజకీయం ప్రస్తుతం తమిళ నాట వాతావరణం వేడిగా మారిపోయింది. అయితే ఈవెంట్ రద్దైనప్పటికీ.. ప్రమోషన్స్‌ను మాత్రం పరుగులు పెట్టిస్తున్నారు మేకర్స్. ఇప్పటి వరకు రిలీజ్ అయిన లియో గ్లింప్స్, సాంగ్స్‌కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ట్రైలర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు దళపతి ఫ్యాన్స్. ఎట్టకేలకు ఇప్పుడా సమయం రానే వచ్చేసిందంటున్నారు. లేటెస్ట్ బజ్ ప్రకారం.. లియో ట్రైలర్‌ను అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
Read Also: Prabhas Vs Shahrukh: క్లాష్ ఆఫ్ టైటాన్స్… గెలిచినోడే ఇండియన్ సినిమా కింగ్
అతి త్వరలో లేవు ట్రైలర్ కి సంబంధించిన అఫిషీయల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ లోపు లియో సెకండ్ సింగిల్ బయటికి వచ్చేసింది. ఇక మాస్టర్ తర్వాత విజయ్, లోకేష్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో లియోపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా… అర్జున్, సంజయ్ దత్, ప్రియా ఆనంద్ కీలకపాత్రలు పోషించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 19న లియో రిలీజ్ కాబోతోంది. అదే రోజు బాలయ్య నటిస్తున్న ‘భగవంత్ కేసరి’ కూడా రిలీజ్ కానుంది. కోలీవుడ్‌లో విజయ్‌కు తిరుగులేకపోయినా… తెలుగులో మాత్రం బాలయ్యదే హవా. మరి లియో ఎలా ఉంటుందో చూడాలి.
Read Also: Dunki: ప్రశాంత్ నీల్ Vs షారుక్… KGF దెబ్బకి అయిదేళ్లు మాయం…