రాజమౌళి తర్వాత రాజమౌళి రికార్డ్స్ ని కొట్టగల ఏకైక ఇండియన్ దర్శకుడు రాజమౌళి మాత్రమే అనుకునే వాళ్లు. ఆ మాటని చెరిపేస్తూ రాజమౌళికి సరైన పోటీ అని పేరు తెచ్చుకున్నాడు ప్రశాంత్ నీల్. మాస్ సినిమాలకి సెంటిమెంట్ ని కలిపి పర్ఫెక్ట్ కమర్షియల్ డ్రామా సినిమాలని చేస్తున్న ప్రశాంత్ నీల్, KGF 2 సినిమాతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు చూసేలా చేసాడు. లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ కి ఎలివేషన్స్ ఇచ్చి ఆడియన్స్ తో విజిల్స్ వేయించడం ప్రశాంత్ నీల్ స్టైల్… తెరపై కనిపించే ప్రతి క్యారెక్టర్ హీరోకి ఎలివేషన్స్ ఇవ్వాల్సిందే, ఇదే ప్రశాంత్ నీల్ సినిమాలని ఆడియన్స్ ఇష్టపడేలా చేస్తుంది. కేవలం మూడు సినిమాలతో పాన్ ఇండియా రేంజులో ఇంత పేరు తెచ్చుకున్న దర్శకుడు మరొకరు లేరు. ఆ రేంజ్ మైంటైన్ చేస్తున్న ప్రశాంత్ నీల్, షారుఖ్ ఖాన్ పై పగబట్టినట్లు ఉన్నాడు. 2018లో KGF ఛాప్టర్ 1 సినిమాని షారుఖ్ ఖాన్ జీరో మూవీకి పోటీగా రిలీజ్ చేసిన ప్రశాంత్ నీల్… క్లాష్ లో గెలిచి జెండా ఎగరేసాడు. ఈ దెబ్బకి షారుఖ్ ఖాన్ అయిదేళ్ల పాటు సినిమాలు చేయలేదు.
అప్పటికే షారుఖ్ ఫ్లాప్స్ లో ఉన్నా కూడా సినిమాలని మాత్రం చేస్తూనే ఉన్నాడు. జీరో నార్త్ బెల్ట్ లో చావుదెబ్బ తినడంతో షారుఖ్ ఖాన్ ఇమ్మిడియట్ గా బ్రేక్ తీసుకున్నాడు. అయిదేళ్ల బ్రేక్ తర్వాత పఠాన్, జవాన్ సినిమాలతో షారుఖ్ ఖాన్ కంబ్యాక్ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలని ఇచ్చాడు. తన కెరీర్ మొత్తంలో పీక్ ఫామ్ లో ఉన్న షారుఖ్ ఖాన్ కి ఇప్పుడు మరోసారి ప్రశాంత్ నీల్ ఎదురెళ్తున్నాడు. KGF టైంలో యష్ ఎవరికీ తెలియదు, ప్రశాంత్ నీల్ కూడా ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడలా కాదు అగ్నికి వాయువు తోడైనట్లు ప్రశాంత్ నీల్ కి ప్రభాస్ కలిసాడు. ఈ ఇద్దరూ కలిసి సలార్ సినిమాని షారుఖ్ డుంకి సినిమాకి పోటీగా దించుతున్నారు. ఈ క్లాష్ లో ఒకవేళ ప్రశాంత్ నీల్-ప్రభాస్ గెలిస్తే మాత్రం ప్రైమ్ టైంలో, పీక్ ఫామ్ లో ఉన్న షారుఖ్ ఖాన్ ని బీట్ చేసినట్లే అవుతుంది. మరి డిసెంబర్ మూడో వారంలో ఏం జరగబోతుందో చూడాలి.