దళపతి విజయ్ పేరు ట్విట్టర్ ని కబ్జా చేసింది. విజయ్ బర్త్ డే జూన్ 22న ఉండడంతో ఫాన్స్ అంతా సోషల్ మీడియాలో విజయ్ కి సంబంధించిన సినిమాల అప్డేట్స్, ఫొటోస్ తో హల్చల్ చేస్తున్నారు. జూన్ 22నే లోకేష్ కనగరాజ్ తో విజయ్ చేస్తున్న ‘లియో’ మూవీ టీజర్ కూడా రిలీజ్ కానుంది. కోలీవుడ్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ‘లియో’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలని మరింత పెంచాలి అంటే మేకర్స్ ప్రమోషన్స్ సాలిడ్ గా స్టార్ట్ చేయాలి. అందుకే విజయ్ బర్త్ డే రోజునే ప్రమోషన్స్ ని స్టార్ట్ చేస్తే సాలిడ్ బజ్ జనరేట్ చెయ్యొచ్చు అనేది మేకర్స్ ప్లాన్. దీపావళి రిలీజ్ టార్గెట్ గా రానున్న లియో మూవీలో విజయ్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు. లియో మూవీ అప్డేట్ తో పాటు విజయ్ ఫాన్స్ కి జూన్ 22న కిక్ ఇచ్చే మరో న్యూస్ కూడా బయటకి రానుంది. విజయ్ ఇటీవలే వెంకట్ ప్రభుతో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు.
అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీకి CSK అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు అనే టాక్ కోలీవుడ్ లో వినిపిస్తోంది. CSK అంటే చెన్నై సూపర్ కింగ్స్ అనే విషయం ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. తమిళనాడులో CSK టీంకి, ధోనికి డెమి గాడ్ స్టేటస్ ఉంది. దీన్నే టైటిల్ గా పెట్టి కథలో కాస్త క్రికెట్ టచ్ ఇస్తే CSK టీం ఫాన్స్ సపోర్ట్ కూడా సినిమాకి దొరికేస్తుంది అనే ఆలోచనలో వెంకట్ ప్రభు ఉన్నట్లున్నాడని తమిళ మీడియాలో వినిపిస్తున్న మాట. వెంకట్ ప్రభు, తల అజిత్ తో చేసిన గ్యాంబ్లర్’ సినిమాలో లైట్ గా బెట్టింగ్ టచ్ ఇచ్చాడు. ఆ పాయింట్ ని రిఫరెన్స్ గా తీసుకోని CSK కథని వెంకట్ ప్రభు రెడీ చేస్తున్నాడని టాక్. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. విజయ్ సినిమాకి CSK టైటిల్ అనేది ట్యాక్టికల్ గా మంచి ఆలోచనే అయినా ఆ సినిమా హిట్ అయితే ఎక్కువ క్రెడిట్ ధోని ఫాన్స్ కి వెళ్లే ప్రమాదం ఉంది కాబట్టి విజయ్ ఈ ఆలోచనని రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది.