ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో కోలీవుడ్ నుంచి పాన్ ఇండియా ఆడియన్స్ ని రీచ్ అయ్యాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. నైట్ ఎఫెక్ట్ లో, యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ హ్యూమన్ ఎమోషన్స్ ని బాలన్స్ చేసే సినిమాలు ఎక్కువగా చేసే లోకేష్ కనగరాజ్… తనకంటూ ఒక స్పెషల్ యూనివర్స్ ని క్రియేట్ చేసుకున్నాడు. ముఖ్యంగా విక్రమ్ సినిమా క్లైమాక్స్ తో లోకేష్ కనగరాజ్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా లియో. మాస్టర్ సినిమా తర్వాత లోకీ అండ్ విజయ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని అందుకోవడంలో ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదని లియో ట్రైలర్ క్లియర్ కట్ గా చెప్పేసింది. అక్టోబర్ 19న రిలీజ్ కానున్న ఈ మూవీ తర్వాత లోకేష్ కనగరాజ్ తలైవర్ రజినీకాంత్ తో సినిమా చేస్తున్నాడు.
ఇటీవలే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. నెక్స్ట్ మార్చ్ లేదా ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనున్న ఈ మూవీ ‘తలైవర్ 171’ అనే వర్కింగ్ టైటిల్ తో ప్రీప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఇటీవలే లియో ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో లోకేష్ కనగరాజ్ ‘తలైవర్ 171’ గురించి మాట్లాడుతూ… “రజినీకాంత్ సర్ కోసం కథని ఖైదీ కన్నా ముందే రాసుకున్నాను. కేవలం 20 నిముషాలు మాత్రమే రజినీ సర్ కి చెప్పను, దుమ్ము లేపేద్దాం అన్నారు. రజినీ సర్ కన్నా ముందు విజయ్ సార్ కి ఈ కథ చెప్పాను భయంకరంగా ఉంది, ఇలాంటి కథని ఇప్పటివరకూ వినలేదు అని చెప్పాడు” అని లోకేష్ చెప్పాడు. జైలర్ సినిమాతో ‘టైగర్ కా హుకుమ్’ అని 650 కోట్లు కలెక్ట్ చేసిన రజినీకాంత్ మరి లోకేష్ కనగరాజ్ తో ఎలాంటి ఇండస్ట్రీ రికార్డ్స్ ని నమోదు చేస్తాడు అనేది చూడాలి.