2024 సంక్రాంతి సీజన్ కంప్లీట్ అయ్యింది… ఈ సీజన్ లో ఫెస్టివల్ హాలిడేస్ ని క్యాష్ చేసుకోవడానికి మహేష్ బాబు, నాగార్జున , వెంకటేష్, తేజ సజ్జ లాంటి హీరోలు తమ సినిమాలని రిలీజ్ చేసారు. ఈ హీరోల్లో తేజ సజ్జ, మహేష్ బాబు డబుల్ సెంచరీలు కొట్టగా… నాగార్జున హాఫ్ సెంచరీ కొట్టాడు, వెంకటేష్ ఆడియన్స్ ని మెప్పించలేకపోయాడు. తేజ సజ్జ ఇంకా స్లో అవ్వలేదు, అదే జోష్ లో కలెక్షన్స్ ని రాబడుతున్నాడు. ఇండియా నుంచి ఓవర్సీస్ వరకు అన్ని సెంటర్స్ లో హనుమాన్ మూవీ సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతోంది. ఇక ఇప్పటి నుంచే వచ్చే సంక్రాంతి సినిమాల గురించి డిస్కషన్స్ మొదలైపోయాయి. 2025 సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ… ఇప్పటికే బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కనున్న నాలుగో సినిమా రెడీ అవనుందని సమాచారం. మోస్ట్ సక్సస్ ఫుల్ కాంబినేషన్ గా పేరున్న బాలయ్య-బోయపాటి కలిసి అఖండ 2తో 2025 సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి రానున్నారని సమాచారం. పాన్ ఇండియా టార్గెట్ గా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. హనుమాన్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పార్ట్ 2 జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ని స్టార్ట్ చేసాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా కూడా 2025 సంక్రాంతి సిద్ధమవనుంది.
కింగ్ నాగార్జున కూడా బంగార్రాజు ఫ్రాంచైజ్ నుంచి ఇప్పటికే సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు సినిమాలని సంక్రాంతికే రిలీజ్ చేసి హిట్ కొట్టాడు. నెక్స్ట్ కూడా బంగార్రాజు ఫ్రాంచైజ్ నుంచి మూడో సినిమాని 2025 సంక్రాంతి రేస్ లో నిలబెట్టాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్ హౌజ్ నుంచి కూడా ఒక సీక్వెల్ బయటకి రాబోతుంది. శర్వానంద్ హీరోగా నటించిన శతమానం భవతి సినిమాకి సీక్వెల్ ని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 2025 సంక్రాంతికి రెడీ అవనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి మ్యాడ్ 2 కూడా వచ్చే సంక్రాంతి సీజన్ నే టార్గెట్ చేస్తోంది. యూత్ ని మెప్పించిన మ్యాడ్ పార్ట్ 1కి సీక్వెల్ వర్క్స్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయాయి. ఇలా 2025 సంక్రాంతి సీజన్ రిలీజ్ రేస్ లో ఇప్పటికైతే సీక్వెల్స్ ని బాగానే అనౌన్స్ చేసారు. ఇవి మాత్రమే కాకుండా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా సంక్రాంతి సీజన్ నే టార్గెట్ చేస్తూ షూటింగ్ జరుపుకుంటుంది. అన్ని సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వడం కుదరదు కాబట్టి ఆ సమయానికి ఏది ముందుకి ఏది వెనక్కి వెళ్తుంది అనేది చూడాలి.