Movies Releasing This Week: నిఖిల్ ‘స్పై’తో పాటు ఐదు సినిమాలు.. రెండు రీ రిలీజులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telugu Movies Releasing This Week: ఈ వారం థియేటర్లలో ఏకంగా ఎనిమిది సినిమాలు సందడి చేయబోతున్నాయి. యంగ్ హీరోలు నిఖిల్ స్పై సినిమాతో, శ్రీవిష్ణు సామజవరగమన సినిమాతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతుండగా శుక్రవారం నాడు మరిన్ని సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఇక ముందుగా నిఖిల్ స్పై సినిమా విషయానికి వస్తే కార్తికేయ -2 ఘన విజయం తర్వాత నిఖిల్ నుంచి వస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాతో ఎడిటర్ గ్యారీ బీహెచ్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తుండగా రాజశేఖర్ రెడ్డి కధ అందించడమే కాదు నిర్మిస్తున్నారు కూడా. ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో ఆర్యన్ రాజేష్, సన్య ఠాకూర్ కీలక పాత్రల్ని పోషిస్తుండగా రానా అతిధి పాత్రలో కనిపించనున్నారు. ఇక గత కొంతకాలంగా సరైన కమర్షియల్ బ్రేక్ కోసం ఎదురుచూస్తోన్న శ్రీవిష్ణు జూన్ 29న సామజరవరగమన సినిమాతో బాక్సాఫీస్ ముందుకు రానున్నాడు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ మూవీకి రామ్ అబ్బరాజు దర్శకుడు కాగా రెబా మౌనికా జాన్ హీరోయిన్గా నటిస్తోంది.
Samajavaragamana Review: ‘సామజవరగమన’ రివ్యూ
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా ఈ మూవీని నిర్మించగా ఇప్పటికే ప్రీమియర్స్ కి మంచి టాక్ వచ్చింది. ఇవి కాక సీనియర్ డైరెక్టర్ కే దశరథ్ కథను అందిస్తూ డీవై చౌదరి దర్శకత్వంలో నిర్మించిన లవ్ యూ రామ్ మూవీ జూన్ 30న విడుదలకానుంది. లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ మూవీలో రోహిత్ బెహల్, అపర్ణ జనార్ధనన్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇక పాయల్ రాజ్‌పుత్, విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్ ప్రధాన పాత్రల్లో నటించిన మాయా పేటిక సినిమా కూడా జూన్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. దర్శకుడు రమేష్ రాపర్తి మాయాపేటిక సినిమాను తెరకెక్కించారు. సింగర్ విజయ్ ఏసుదాస్ హీరోగా న టించిన మలయాళ మూవీ సాల్మన్ సినిమా, నారాయణ అండ్ కో అనే సినిమా కూడా తెలుగులో రిలీజ్ కానుంది. అలాగే హాలీవుడ్ సినిమా ఇండియా జోన్స్ తెలుగులో అదే రోజున థియేటర్లలో సందడి చేయనుంది. ఇక ఇవి కాక రెండు సినిమాల రీ రిలీజులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ, తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు… సీట్లు దక్కేదెవరికి…?
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!