Site icon NTV Telugu

Tollywood : చర్చలు సఫలం.. రేపటి నుంచి షూటింగులు ప్రారంభం

Tollywood

Tollywood

Tollywood : సినీ కార్మికుల సమ్మెకు మొత్తానికి ముగింపు పలికారు. నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యుల మధ్య ఈ రోజు లేబర్ కమిషన్ వద్ద చివరిసారిగా చర్చలు జరిగాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. మీటింగ్ లో ఈ చర్చలు సఫలం అయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. కార్మికులు 3 ఏళ్లలో 30 పర్సెంట్ వేతనాలు పెంచాలన్నారు. ఫెడరేషన్, నిర్మాతల మధ్య చర్చలు జరిపాం. ఇప్పుడు కమిషన్ వద్దకు వచ్చాం. ప్రొడ్యూసర్ల నుంచి 4 కండీషన్లను వారి ముందు పెట్టాం. కాల్షీట్ల విషయం, రేషియో గురించి అడిగాం. 9టు 9 కాల్షీట్లకు కార్మికులు వారు ఒప్పుకున్నారు. వేతనాలు పెంచేందుకు మేం కూడా ఒప్పుకున్నాం.

Read Also : Arya Marriage : 12 ఏళ్ల కూతురు ఉండగా రెండో పెళ్లి చేసుకున్న యాంకర్

3 ఏళ్లకు గాను 22.5 పెంచేందుకు ఒప్పందం జరిగింది. రూ.2వేల కంటే తక్కువ ఉన్న వారికి మొదటి సంవత్సరం 12.5, రెండో ఏడాది 2.5, మూడో ఏడాది 5 పర్సెంట్ పెంచుతాం. రూ.2వేల నుంచి 5వేల మధ్య వేతనం ఉన్న వారికి మొదటి ఏడాది 7.5, రెండో ఏడాది 5, మూడో ఏడాది 5 వేతనాల పెంపు ఉంటుంది. చిన్న సినిమాలకు మాత్రం 15 శాతం డిస్కౌంట్ లోనే పనిచేస్తున్నారు. అదే కంటిన్యూ అవుతుంది. మిగతా సమస్యలు కొన్ని ఉన్నాయి. వాటిని పరిష్కరించేందుకు ఇంకో నెల రోజులు టైమ్ అడిగాం అంటూ తెలిపారు. లేబర్ కమిషనర్ గంగాధర్ మాట్లాడుతూ.. నిర్మాతలు వేతనాలు పెంచేందుకు ఒప్పుకున్నారు. మూడు, నాలుగు కండీషన్స్ మీద ప్రధానంగా చర్చలు జరిపాం. ప్రినిసిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేస్తున్నాం. మిగతా చిన్న చిన్న సమస్యల కోసం ఈ కమిటీ పనిచేస్తుంది. నెల రోజుల్లో అన్నీ పరిష్కరిస్తాం. సమ్మె వెంటనే ఆపేస్తున్నారు. రేపటి నుంచి షూటింగులు యథావిధిగా స్టార్ట్ అవుతాయి అంటూ తెలిపారు.

Exit mobile version