Zee : న్యూ ఇయర్ కానుకగా జీ తెలుగు డబుల్ బొనాంజా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనునిత్యం వినోదం పంచే కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు మరిన్ని వినోదభరిత కార్యక్రమాలతో 2024 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూనే, నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. ఇటీవల ఖమ్మంలో ఘనంగా జరిగిన ‘సరిగమప పార్టీకి వేళాయెరా’ కార్యక్రమాన్ని డిసెంబర్ 31, రాత్రి10 గంటలకుప్రసారం చేయనుంది. ఆసక్తికరమైనమలుపులు, అదిరిపోయే ట్విస్ట్స్ తో సాగే సీరియల్స్ అందిస్తున్న జీతెలుగు మరోఆకట్టుకునే అంశంతో సాగే చామంతి సీరియల్ ను నూతన సంవత్సర కానుకగా అందిస్తోంది.‘సరిగమప పార్టీకి వేళాయెరా’ డిసెంబర్ 31, సరికొత్త సీరియల్ చామంతిని జనవరి 1న(బుధవారం) ప్రతిరోజు రాత్రి8:30 గంటలకు ప్రసారం కానుంది.
Also Read : KA10 : కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబా’ రిలీజ్ డేట్ ఫిక్స్
Also Read
ఇటీవల ఖమ్మం వేదికగా జీ తెలుగు నిర్వహించిన న్యూ ఇయర్ స్పెషల్ ఈవెంట్ సరిగమప పార్టీకి వేళాయెరా కార్యక్రమాన్ని 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ ప్రసారం చేస్తోంది. యాంకర్ రవి, లాస్య వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో సరిగమప గాయనీగాయకులు జీ తెలుగు సీరియల్ నటీనటులతో పోటీపడ్డారు. మేఘసందేశం సీరియల్ నుంచిగగన్ (అభినవ్), భూమి (భూమిక),నిండునూరేళ్ల సావాసం సీరియల్ నుంచిఅమరేంద్ర (రిచర్డ్జోస్), అరుంధతి (పల్లవిగౌడ),భాగమతి(నిసర్గగౌడ),చిరంజీవిలక్ష్మీసౌభాగ్యవతిసీరియల్ నుంచి మిత్ర (రఘు), లక్ష్మి (మహిగౌతమి) తదితరులు పాల్గొని అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. హృదయాన్నిహత్తుకునే పాటలు, ఉల్లాసకరమైన ఆటలు, అద్భుతమైన ప్రదర్శనలతో కార్యక్రమం ఆద్యంతం కోలాహలంగా సాగింది. పాటల పోటీలు, కామెడీస్కిట్లు, అందాల పోటీలు నిర్వహించడమే కాకుండా ఈ వేదికపై ప్రతిభావంతులైన దివ్యాంగులను ప్రోత్సహించింది జీ తెలుగు. 2024 సంవత్సరానికి ఘనమైన వీడ్కోలు పలుకుతూ అభిమానుల కోలాహలంతో సాగిన ఈ కార్యక్రమాన్ని మీరూ మిస్ కాకుండా చూసేయండి.
చలాకీ అమ్మాయి అయిన చామంతి(మేఘనా లోకేష్) తన కుటుంబంతో ఊరిలో జీవిస్తుంది. చామంతి కుటుంబం ఆ ఊరిలో జమీందారీ ఇంట్లో నమ్మకంగా పని చేస్తుంది. చామంతితండ్రి – రామచంద్రయ్య (ప్రభాకర్), తల్లి మూగ. చామంతి అక్క రోజా వాయుపుత్ర ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తుంది. ఇక జమీందారీ కుటుంబ సహాయంతో ఎదిగిన వ్యక్తి వాయుపుత్ర ఎయిర్‌లైన్స్ ఎండీ హర్షవర్ధన్. అరుణ్, ప్రేమ్ హర్షవర్ధన్ వారసులు. పల్లెటూర్లో ఉండే చామంతి హైదరాబాద్ ఎలా చేరుకుంది? చామంతి, ప్రేమ్ మధ్య ప్రేమ ఎలా చిగురిస్తుంది? రోజా హర్షవర్ధన్ ఇంటికి ఎలా చేరుకుంటుంది? వంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే జీ తెలుగులో ప్రసారమయ్యే చామంతి సీరియల్ చూడాల్సిందే.
తాజావార్తలు
-
Mydukur Election Suspended: మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు రద్దు.. ఎస్ఈసీ కీలక ప్రకటన
-
Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కేవలం 45 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్..!
-
RAPO 23: టాలీవుడ్లోకి రితీష్ దేశ్ ముఖ్
-
Chris Gayle Catch: 47 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. గాల్లోకి ఎగిరి స్టన్నింగ్ క్యాచ్.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే!
-
AP ZPTC, MPTC Elections 2026: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్.. నామినేషన్లు, పోలింగ్, కౌంటిగ్ పూర్తి వివరాలు..
ట్రెండింగ్
-
Cinnamon Plant: మార్కెట్ దాల్చిన చెక్కకు గుడ్ బై.. ఇంట్లోని కుండీలోనే సులువుగా పెంచేయండిలా..
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?