Ummadi Kutumbam: నవంబర్ 4 నుంచి కుటుంబమే ప్రధానంగా ‘ఉమ్మడి కుటుంబం’ సీరియల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసక్తికరమైన మలుపులు, ఆకట్టుకునే కథలతో సాగే సీరియల్స్ అందిస్తున్న జీతెలుగు మరో సరికొత్త సీరియల్‌ను తన అభిమాన వీక్షకులకు అందించేందుకు సిద్ధమైంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం, అనురాగాలనే పథ్యంలో సాగే ఆసక్తికరమైన కథ, కథనంతో రూపొందుతున్న సరికొత్త సీరియల్ ‘ఉమ్మడి కుటుంబం’. ఈ సీరియల్లో ఉమ్మడి కుటుంబం విశిష్టత, ప్రాధాన్యం, కుటుంబ సభ్యుల మధ్యనున్న అనుబంధం, ప్రేమ, బాధ్యతలు, అనురాగాలను కొత్త కోణంలో చూపించనున్నారు. ఆకట్టుకునే కథతో రానున్న ‘ఉమ్మడి కుటుంబం’ నవంబర్ 4న ప్రారంభం, సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. ఉమ్మడి కుటుంబం అనే విలక్షణమైన కుటుంబ నేపథ్యంలో సాగే సరికొత్త సీరియల్‌తో వచ్చేస్తోంది జీ తెలుగు. కుటుంబమే మొదటి ప్రాధాన్యతగా జీవిస్తున్న ఆనంద భైరవి(రూప) తన కొడుకు కోసం తగిన వధువుని వెతుకుతుంది. సౌమ్యత, గౌరవం కలబోసినట్లున్న శరణ్య(సాక్షి)ను తన కొడుక్కి తగిన భాగస్వామిగా నమ్ముతుంది ఆనంద.
శరణ్య సోదరి అనన్య (సుస్మిత) అందుకు పూర్తి భిన్నంగా ఆలోచిస్తూ స్వేచ్ఛాయుత జీవనాన్ని ఇష్టపడుతుంది. ఆనంద కుటుంబంలోకి అనన్య ఎలా ప్రవేశిస్తుంది? శరణ్య జీవితంలో ప్రతినాయకి ఎవరు? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఉమ్మడి కుటుంబం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే! రూప (ఆనంద), యశ్వంత్ (దర్శన్), సాక్షి(శరణ్య) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నఈ సీరియల్లో కరమ్ (రోహిత్), సుస్మిత (అనన్య) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అన్నదమ్ములు, తోడికోడళ్ల అనుబంధం, అసూయ, ప్రతీకారం ముఖ్యాంశాలుగా ఆసక్తికరంగా సాగే ఉమ్మడి కుటుంబం సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమవుతుంది. జీ తెలుగు అందిస్తున్న కొత్త సీరియల్ ’ఉమ్మడి కుటుంబం’ ప్రారంభంతో ప్రస్తుతం ఉన్న ఇతర సీరియళ్ల ప్రసార సమయాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమవుతున్న సీతారామ ఇక నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రసారమవుతుంది. చాలాకాలంగా జీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సూర్యకాంతం సీరియల్ ముగియనుంది. ప్రేక్షకులు ప్రసార సమయాల్లో మార్పు గమనించి కొత్త సీరియల్ ఉమ్మడి కుటుంబంతో పాటు మీ అభిమాన సీరియల్స్ మిస్ కాకుండా చూసేయండి!
Also Read
తాజావార్తలు
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!