బుల్లితెర నటి మహేశ్వరీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బుల్లితెర పై ఎన్నో సీరియల్స్ ను నటించింది.. ఇప్పుడు సీరియల్స్ లో కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది.. తన కూతురుతో కలిసి రీల్స్ చేస్తూ వస్తుంది.. అంతేకాదు రెండోసారీ ప్రగ్నెంట్ అయిన ఈమె మెటర్నటీ ఫోటోషూట్లతో తెగ సందడి చేసింది. భర్త, కూతురితో కలిసి బేబీబంప్‌తో ఫోటోలకు ఫోజిచ్చింది… ఆ ఫోటోలు కూడా నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.. ఇప్పుడు సీమంతం ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది..
సీమంతంకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతున్నాయి… భార్య అంటే ప్రాణం అయిన శివ తనకు జీవితాంతం గుర్తుండిపోయేట్లు అదిరిపోయే సర్ ప్రైజ్ ను ఇచ్చాడు.. శివ తన భార్యకు మరోసారి సీమంతం చేశాడు.. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక నిర్వహించారు. ఈ ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోలను నటి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.. అవి కాస్త నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి..
ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో ఆమె ఫ్యాన్స్, ఫ్రెండ్స్ విసెష్ తెలుపుతున్నారు.. కాగా మహేశ్వరి.. వదినమ్మ, శశిరేఖ పరిణయం వంటి పలు సీరియల్స్‌లో నటించింది. అంతేకాదు తన భర్తతో కలిసి పలు షోలల్లో మెరిసింది.. ప్రస్తుతం రెండో బిడ్డకు జన్మనివ్వబోతుంది..