Zee Serials: సిరిసిల్లలో ‘సీతారాముల నిండు నూరేళ్ళ సావాసం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీ తెలుగు సీరియల్స్ సీతే రాముడి కట్నం, నిండు నూరేళ్ల సావాసం నటీనటులతోపాటు ఇతర తారలు తమ అభిమానులను నేరుగా కలిసేందుకు ‘సీతారాముల నిండు నూరేళ్ల సావాసం’ పేరున ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించింది. అభిమానుల కోలాహలంతో ఘనంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమం ‘సీతారాముల నిండు నూరేళ్ల సావాసం’ నవంబర్ 3న మధ్యాహ్నం 12 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. జీ తెలుగు ఇటీవల సిరిసిల్లలో ప్రముఖ నటీనటులతో కార్యక్రమాన్ని నిర్వహించి వీక్షకులకు ఆహ్లాదకరమైన అనుభవాన్ని అందించింది. ప్రముఖ యాంకర్ లాస్య వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ఆద్యంతం ప్రేక్షకులకు వినోదం పంచింది. జీ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ విజయవంతంగా కొనసాగుతున్న ‘సీతే రాముడి కట్నం’, ‘నిండు నూరేళ్ల సావాసం’ నటీనటులు ఈ వేదికపై నుంచి తన అభిమానులతో సంభాషించడమే కాకుండా పలు బహుమతులను కూడా పంచి వారి సంతోషంలో పాలుపంచుకున్నారు.
సీతేరాముడికట్నం జోడీ సీత (వైష్ణవి)-రామ్ (సమీర్),మహాలక్ష్మి(మంజుల పరిటాల)నిండు నూరేళ్ళ సావాసం అమరేంద్ర (రిచర్డ్ జోస్)-అరుంధతి (పల్లవి గౌడ), అమరేంద్ర (రిచర్డ్ జోస్)-భాగమతి (నిసర్గ)తెరమీద కాదు తెర వెనుక కూడా తమ మధ్య అనుబంధం ఎలా ఉంటుందో ప్రేక్షకులకు చూపించి వినోదం పంచారు. ఉత్సాహవంతంగా సాగిన ఈ కార్యక్రమంలో సరిగమప గాయనీ గాయకులతో పాటు జానపద గాయకుల పాటలు, డ్రామా జూనియర్స్ పిల్లల స్కిట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రెండు సీరియల్స్‌పై వచ్చిన సరదా మీమ్స్ ప్రదర్శిస్తూ సాగిన కామెంటరీ అందరినీ కడుపుబ్బా నవ్వించింది. ‘అసలైన అమరేంద్ర ఎవరు?’ అంటూ సాగిన డ్రామా జూనియర్స్ స్కిట్ ఆసక్తికరంగా సాగింది. జీ తెలుగు నటీనటులు తమ అభిమానులతో సెల్ఫీ దిగడం, బహుమతులతో సర్ ప్రైజ్ చేయడంతోపాటు వారిని పలకరించి ముచ్చటించారు. నటీనటులు చెరగని అనుభూతులు పంచారు.
Also Read
తాజావార్తలు
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
-
Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
-
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
-
Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
-
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!