Kunika Sadanand Marriage: 62 ఏళ్ల వయసులో పెళ్లికి రెడీ అంటున్న సీనియర్ నటి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kunika Sadanand Marriage: సీనియర్ నటి కునికా సదానంద్ మరోసారి తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచారు. 62 ఏళ్ల వయసులో కూడా తాను ప్రేమకు, పెళ్లికి సిద్ధంగా ఉన్నానని ఆమె చెప్పడం ఆసక్తికరంగా మారింది. వినోద రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన కునికా, ఇటీవల తన వ్యక్తిగత జీవితం గురించి ఓ ఇంటర్వ్యూలో ఓపెన్‌గా మాట్లాడారు. ఇప్పటివరకు తాను ఆరు సంబంధాలలో ఉన్నానని వెల్లడించారు. అందులో రెండు వివాహాలు, రెండు సహజీవనాలు, ఇంకా రెండు స్వల్పకాలిక సంబంధాలు ఉన్నాయని తెలిపారు.
Read Also: Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ – ట్రావెల్స్ బస్సు ఢీ.. 15 మందికి గాయాలు..!
Also Read
సమాజంలో ఇలాంటి స్వేచ్ఛ ఎక్కువగా పురుషులకు మాత్రమే ఉంటుందని, కానీ మహిళలకు కూడా అదే హక్కు ఉందని కునికా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కూడా తాను ప్రేమ కోసం సిద్ధంగా ఉన్నానని, అయితే ఈసారి స్థిరమైన, నిబద్ధత ఉన్న సంబంధం కావాలని చెప్పారు. ఒకప్పుడు ప్రముఖ గాయకుడు కుమార్ సానుతో కునికా సదానంద్‌కు ప్రేమ సంబంధం ఉన్న విషయం తెలిసిందే. ఆయనతో కొన్ని సంవత్సరాలు సహజీవనం కూడా చేసినట్లు ఆమె వెల్లడించారు. అయితే ఆ సంబంధం చివరకు నిలవలేదని తెలిపారు. వివాహ జీవితంలో కూడా కునికాకు రెండు సార్లు అనుభవం ఉంది. కానీ ఆ సంబంధాలు సఫలం కాలేదు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిని ఒంటరిగా పెంచడానికి తాను ఎన్నో కష్టాలు పడినట్లు చెప్పారు. ఇప్పటికీ జీవితంలో ఒక మంచి భాగస్వామి దొరికితే, మళ్లీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని కునికా స్పష్టం చేశారు. ఈ వయసులో కూడా తన భావాలను బహిరంగంగా వ్యక్తం చేయడం చాలా మందిని ఆకట్టుకుంటోంది.
తాజావార్తలు
-
22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
-
Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
-
Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
-
OnePlus 13s: 16GB RAMతో OnePlus 13s కొత్త వేరియంట్ రిలీజ్.. 50MP కెమెరా, 5,850mAh బ్యాటరీ
-
Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..