35Movie : 35 చిన్న కథ కాదు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వినోదంతోపాటు విజ్ఞానం పెంపొందించే కార్యక్రమాలతో అలరించే జీ తెలుగు ఈ సంవత్సరం జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని 35 చిన్న కథ కాదు సినిమా ప్రసారం చేసేందుకు సిద్ధమైంది. ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్గణితశాస్త్రానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయనకు నివాళులు అర్పిస్తోంది. జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా 35 చిన్నకథ కాదు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డిసెంబర్ 22న (ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు.. జీ తెలుగులో ప్రసారం కానుంది.
Also Read : NBK 109 : డాకు మహారాజ్ సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఇదే
Also Read
35 చిన్న కథ కాదు సినిమా కథ లెక్కల చుట్టూ తిరుగుతుంది. తిరుపతిలో నివసించే మధ్యతరగతికి చెందిన భార్యాభర్తలు సత్యప్రసాద్(విశ్వదేవ్ రాచకొండ), సరస్వతి (నివేదా థామస్). వారికి ఇద్దరు కొడుకులు అరుణ్(అరుణ్‌దేవ్ పోతుల), వరుణ్(అభయ్ శంకర్). అరుణ్ గణిత నియమాలు తప్పని వాటిని ఎందుకు పాటించాలంటూ ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. మ్యాథ్స్ టీచర్ చాణక్య వర్మ(ప్రియదర్శి) అరుణ్‌ని జీరో అని పిలవడంతో సరస్వతి, సత్య ఆందోళన చెందుతారు. అరుణ్ అడిగే ప్రశ్నలేంటి? సరస్వతి తన కొడుకు సమస్యను ఎలా పరిష్కరిస్తుంది? అనే విషయాలు తెలియాలంటే జీ తెలుగులో ప్రసారమయ్యే 35 చిన్న కథ కాదు సినిమా చూడాల్సిందే. గణిత శాస్త్రంలో అంకెలు సృష్టించే మాయాజాలం, ఆకట్టుకునే కథాంశంతో మేళవించిన అసాధారణ కథతో రూపొందిన ఈ సినిమాకి నందకిషోర్ ఈమని దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ, గౌతమి కీలక పాత్రలు పోషించారు. ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అలరించిన 35 చిన్న కథ కాదు సినిమాని జీ తెలుగు వేదికగా మీరూ చూసేయండి.
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!