Telangana Government Has Given Permission to Screen Salaar Shows at 1 AM in the Following 20 Theatres: ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ మొదటి భాగం సీజ్ ఫైర్ మరో మూడు రోజుల్లో ఆడియన్స్ ని పలకరించబోతుంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా యాక్షన్ ట్రైలర్ ఆడియన్స్ లో సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. దీంతో ఈ మూవీ బుకింగ్స్ ని ఎప్పుడు ఓపెన్ చేస్తారా..? ఎప్పుడు టికెట్స్ కొనుగోలు చేద్దామా అని ఎదురు చూస్తున్నారు ఫాన్స్. అంతేకాదు స్పెషల్ షోలు ఏమన్నా ఉంటాయా అని వెయిట్ చేస్తున్నారు. తెలంగాణలో స్పెషల్ షోలకు అనుమతిని ఇచ్చారు. మొదటిరోజు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆరు షోలు పడబోతున్నాయి. ఇక 20 సెలెక్టెడ్ థియేటర్లలో తెల్లవారుజామున ఒంటిగంట షో కూడా వేయనున్నారు. ఇక టికెట్ రేట్లు విషయానికి వస్తే.. సింగిల్ స్క్రీన్స్ లో 250, 175, 100 రేట్లు, మల్టీఫెక్స్ ల్లో 370, 470 ధరతో టికెట్స్ అమ్మాలని నిర్ణయించారు. అంటే సాధారణ టికెట్ రేట్లతో పోలిస్తే మల్టీఫెక్స్ ల్లో రూ.100, సాధారణ థియేటర్లలో రూ.55 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. తెలంగాణలో థియేటర్ హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకోగా థియేటర్ల లిస్టు ఇప్పుడు చూద్దాం.
Salaar: సలార్ టికెట్స్ కోసం పడిగాపులు.. తొక్కిసలాట.. ఏదైనా జరిగితే ఎవరు సర్ రెస్పాన్సిబిలిటీ..?
కింది 20 థియేటర్లలో తెల్లవారుజామున 1 గంటలకు సాలార్ షోలను ప్రదర్శించడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది
1) నెక్సస్ మాల్, కూకట్‌పల్లి
2) AMB సినిమాస్, గచ్చిబౌలి
3) బ్రహ్మరాంబ థియేటర్,
కూకట్‌పల్లి
4) మల్లికార్జున థియేటర్, కూకట్‌పల్లి
5) అర్జున్ థియేటర్, కూకట్‌పల్లి
6) విశ్వనాథ్ థియేటర్, కూకట్‌పల్లి
7) సంధ్య 70MM, RTC X రోడ్స్
8) సంధ్య థియేటర్ 35MM, RTC X రోడ్స్
9) రాజధాని డీలక్స్, దిల్ సుఖ్ నగర్
10) శ్రీరాములు థియేటర్, మూసాపేట
11) గోకుల్ థియేటర్, ఎర్రగడ్డ
12) శ్రీ సాయి రామ్ థియేటర్, మల్కాజిగిరి
13) SVC తిరుమల థియేటర్, ఖమ్మం
14) వినోద థియేటర్, ఖమ్మం
15) వెంకటేశ్వర థియేటర్, కరీంనగర్
16) నటరాజ్ థియేటర్, నల్గొండ
17) SVC విజయ థియేటర్, నిజామాబాద్
18) వెంకటేశ్వర థియేటర్, మహబూబ్‌నగర్
19) శ్రీనివాస థియేటర్, మహబూబ్ నగర్
20) రాధిక థియేటర్, వరంగల్