Amaram : ఆసక్తి రేపుతున్న అమరం టీజర్

Amaram

Amaram

తేజేష్ రాజన్ ప్రధాన పాత్రలో నటిస్తూ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమవుతున్న తాజా చిత్రం ‘అమరం’. ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ వద్ద అసోసియేట్‌గా పనిచేసిన తిరుఅరుల్ కృష్ణన్ ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. తాజాగా మేకర్స్ ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ వరకు ఇంటెన్స్ యాక్షన్‌తో సాగిన ఈ టీజర్ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఓ ట్రైబల్ స్మగ్లర్‌, ఓ కిల్లర్, మరియు ఓ యువతి.. ఈ ముగ్గురి ప్రయాణం చుట్టూ అల్లుకున్న కథే ఈ అమరం. తూర్పు కనుమల (ఈస్ట్రన్ ఘాట్స్) నేపథ్యంగా సాగే ఈ సినిమాలో.. ఎర్రచందనం స్మగ్లర్ల జీవనశైలి, వారు పడే కష్టాలు, ఎదుర్కొనే ప్రమాదాలతో పాటు వారి ప్రపంచంలోని వాస్తవాలను దర్శకుడు బలంగా చూపించబోతున్నారు. దానికి తోడు అక్కడి సామాజిక సమస్యలను కూడా తెరపై ఆవిష్కరిస్తున్నారు.

ఈ సినిమా కోసం కడప పరిసర ప్రాంతాల్లో భారీ సెట్స్ నిర్మించడంతో పాటు, పశ్చిమ కనుమల్లోనూ (వెస్ట్రన్ ఘాట్స్) కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మాస్టర్ మిరాకిల్ మైఖేల్ ఆధ్వర్యంలో, బాంబే మార్షల్ ఆర్ట్స్ టీమ్ సహకారంతో రూపొందించిన మూడు భారీ యాక్షన్ బ్లాక్స్ సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయి. దాదాపు 200 మందికి పైగా ఫైటర్స్ పాల్గొన్న ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ కు సరికొత్త థ్రిల్ ఇస్తాయి. ఇక తొలి సినిమానే అయినా హీరో తేజేష్ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా కొడైకెనాల్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం ‘డాల్ఫిన్ నోస్’ వద్ద తీసిన ఓ రిస్కీ సీన్‌ను ఆయన సింగిల్ టేక్‌లో పూర్తి చేయడం విశేషం. సిట్యువేషనల్ యాక్షన్‌కు లోతైన ప్రేమకథను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఐరా అగర్వాల్ కథానాయికగా నటించగా.. నాగినీడు, సాయి ధీనా, జార్జ్ మరియన్, సురేష్ చంద్ర మీనన్, హరీష్ పరాడి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సాంకేతిక వర్గం విషయానికొస్తే.. ప్రముఖ సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ‘వడచెన్నై’, ‘అసురన్’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు పనిచేసిన రామర్ ఎడిటర్‌గా, భరత్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.