Teja Sajja : యంగ్ హీరో తేజ సజ్జా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చాడు. వరుసగా మంచి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన నుంచి మిరాయ్ సినిమా రాబోతోంది. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. వరుసగా ప్రమోషన్లు చేస్తున్న తేజా.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇండస్ట్రీలో నాకు బెస్ట్ ఫ్రెండ్స్ కొందరే ఉన్నారు. అందులో నాకు ఉదయం 3గంటలకు రానా నుంచి ఏదో ఒక మెసేజ్ వస్తుంది. అతను ఎర్లీ మార్నింగ్ లేచేస్తాడు. నేను కూడా అదే టైమ్ కు మెలకువతో ఉంటే రానాకు మెసేజ్ చేస్తాను.
Read Also : ilayaraja : రూ.4 కోట్ల కిరీటం బహూకరించిన ఇళయరాజా
అతను చాలా డెడికేషన్ తో చేస్తాడు. నాకు ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా నేను ఫస్ట్ కాల్ చేసేది రానాకే. తను నాకు ఒక మాట ఇచ్చాడు. నీకేం ప్రాబ్లమ్ వచ్చినా నేను నీకు అండగా ఉంటా. నువ్వు ముందుకు వెళ్లు అని చెప్పాడు. అప్పటి నుంచి నాకు సపోర్ట్ గా ఉంటున్నాడు. నాకే కాదు.. ఎంతో మందికి రానా సాయం చేస్తుంటాడు. కానీ చెప్పుకోడు. డబ్బు, పేరు కోసం కాదు. కేవలం అతని మంచి మనసు అది అంటూ చెప్పుకొచ్చాడు తేజ. అతను చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also : The Rajasab : రాజాసాబ్ లో సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న ప్రభాస్..