Site icon NTV Telugu

Mirai : మిరాయ్ సినిమా చూస్తే గూస్ బంప్స్ పక్కా : తేజసజ్జా

Mirai

Mirai

Mirai : ఈ సినిమా మేం అనుకున్నప్పుడు ఎలాంటి కరెక్ట్ ప్లాన్ లేదు. కేవలం కథ మీద నమ్మకంతోనే ముందుకు వెళ్లాం. విశ్వ ప్రసాద్ నాకు చాలా బాగా నచ్చిన నిర్మాత. ఆయన ప్రతి సినిమా కోసం ఎంతో కష్టపడుతారు. చాలా రెస్పాన్సిబిలీటీ తీసుకుని అందరికీ సపోర్ట్ చేస్తారు. అందరూ ఎదగాలని కోరుకుంటారు. ఈ మూవీకి మరో పెద్ద బలం మనోజ్ అన్న. ఆయన మాట ఇచ్చినట్టే ఈ సినిమా కోసం ఒప్పుకున్నారు. అందువల్లే సినిమాకు ఇంత హై వచ్చింది. మంచి సినిమా తీయాలనే తపనతోనే ఈ బడ్జెట్ లో తీశాం. రితిక నాయక్ డెడికేషన్ ఉన్న హీరోయిన్. మూడేళ్లు మేం ఎక్కడకు వెళ్తే అక్కడకు వచ్చి చేశారు. ఆమెకు ఆల్ ది బెస్ట్.

Read Also : Manchu Manoj : మీరు నా వెనకాల ఉంటే నన్ను ఎవరు ఏం చేయలేరు

ఈ సినిమాకు హరిగౌర మ్యూజిక్ అందిస్తున్నాడు. హనుమాన్ తర్వాత ఈ సినిమాకు పనిచేస్తున్నారు. ఈ మూవీలో ఆయన బీజీఎం, పాటలు చూస్తే కచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. దానికి నాది గ్యారెంటీ. డైరెక్టర్ కార్తీక్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఆయన చాలా ప్రీ ప్లాన్ ఉన్న డైరెక్టర్. ఆయన చూపించిన విజువల్స్ మామూలుగా లేవు. ఇలాంటి సినిమాలు చేయాలంటే ఎంతో డెడికేషన్, ప్లానింగ్ ఉండాలి. అది కార్తీక్ గారిలో ఉన్నాయి. అందుకే ఇలాంటి సినిమా చేశారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినిమా రిలీజ్ అయ్యాక మీకే అర్థం అవుతుంది. ఈ సినిమాలో జగపతి బాబు నటించారు. ఆయన సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన నేను.. ఆయనతో సినిమాలు చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. శ్రియ గారితో పనిచేయడం హ్యాపీగా అనిపించింది. సినిమా కోసం ఎఫర్ట్ పెట్టి చేశాం. మిరాయ్ సినిమాను కష్టపడి చేశాం వెళ్లి చూడండి. పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే మిరాయ్ తర్వాత కాంతార-2, ఓజీ, ఎస్ ఎస్ ఎంబీ 29, కల్కి-2 సినిమాలు వచ్చాక మేం కూడా ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్తాం అని తెలిపాడు తేజ.

Read Also : SS Rajamouli : వెబ్ సిరీస్ లో నటించిన రాజమౌళి.. ఎలా చేశాడో చూశారా..

Exit mobile version