Teja Sajja Karthik Ghattamaneni Movie Titled Mirayi: చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో పండు సినిమాలు చేసి తర్వాత చదువు మీద దృష్టి పెట్టాడు తేజ సజ్జా. చదువు పూర్తి చేసుకుని మరోసారి సినీ రంగంలో మెరవాలని ప్రయత్నించి ఇప్పటికే హీరోగా పలు సినిమాలు చేశాడు. ఆ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే జనవరిలో రిలీజ్ అయిన హనుమాన్ సినిమా మరో ఎత్తు. ఈ సినిమాలో హనుమంతు అనే ఒక పాత్రలో తేజ కనిపించాడు. చిన్న సినిమాగా అందరి ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదు దాదాపు 300 కోట్లు కలెక్ట్ చేసి అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. ఈ సినిమా తర్వాత తేజ చేసే సినిమా జై హనుమాన్ అయి ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఈగల్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేనితో తేజ సజ్జా సినిమా ఒకటి అనౌన్స్ చేశారు.
Aa Okkati Adakku: మళ్ళీ వెనక్కెళ్ళిన ‘ఆ ఒక్కటీ అడక్కు’!
ఈ రోజు తేజ సజ్జ కార్తీక్ ఘట్టమనేని సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ దీనికి సంబంధించిన గ్లింప్స్ మాత్రం 18వ తేదీన రిలీజ్ చేస్తామని వెల్లడించింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకి మిరాయి(Mirayi) అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇది తెలుగు పదం కాదు జపనీస్ లో మిరాయి అంటే భవిష్యత్తు అని అర్థం. సినిమా లైన్ కి తగ్గట్టుగా ఈ పదాన్ని టైటిల్ గా ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో విలన్ గా మంచు మనోజ్ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది కానీ సినిమా యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్నాడని ప్రచారం ఉంది కానీ అది నిజం కాదని తెలుస్తోంది ఇక 18వ తేదీన రిలీజ్ అయ్యే గ్లింప్స్ తో సినిమా గురించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.