Site icon NTV Telugu

Mirai : షూటింగ్ లో తేజసజ్జాకు గాయాలు.. బయటపెట్టిన హీరోయిన్

Rithika Nayak

Rithika Nayak

Mirai : తేజసజ్జా హీరోగా వస్తున్న మూవీ మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. సెప్టెంబర్ 12న మూవీ రిలీజ్ అవుతోంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె కొన్ని విషయాలను బయట పెట్టింది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. తేజకు అయితే షూటింగ్ లో గాయాలయ్యాయి. అయినా సరే ఆయన రెస్ట్ తీసుకోకుండా షూటింగ్ కు వచ్చాడు. చాలా సార్లు వెదర్ తట్టుకోలేక అతనికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అయినా సరే అతను టైమ్ కు లొకేషన్ లో ఉండేవాడు.

Read Also : Mouli Tanuj : మౌళికి బంగారం లాంటి అవకాశం.. కాపాడుకుంటే తిరుగులేదు..

మేం ఈ మూవీ షూటింగ్ ను చాలా ఏరియాల్లో తిరుగుతూ షూట్ చేశాం. 80 శాతం షూటింగ్ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్లలో చేశాం. నేచురల్ గా ఉండాలనే ఉద్దేశంతోనే అలాంటి చోట్ల షూట్ చేశాం. అది మీకకు థియేటర్లలో కనిపిస్తుంది. మిగతా సినిమాలకు ఈ సినిమాకు చాలా తేడా ఉంది. తేజ నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి. అతని డెడికేషన్ చూస్తే చాలా ముచ్చటేస్తుంది. అందుకే ఆయన ఈ స్థాయిలో ఉన్నారేమో అనిపిస్తుంది. ఇప్పటికీ తేజ చాలా కష్టపడుతూనే ఉన్నాడు అంటూ తెలిపింది రితిక.

Read Also : Shivani Nagaram : శివానీ నగరం దెబ్బ.. ఆ ముగ్గురు భామలకు చెమటలు

Exit mobile version