Teja Sajja : మిరాయ్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు తేజసజ్జా. ఆయన చేసిన సినిమాల్లో మిరాయ్ మరో మైల్ స్టోన్ గా నిలిచిపోతుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఈ సినిమా తర్వాత తేజ నుంచి మరికొన్ని సినిమాలపై ఆసక్తి పెరుగుతోంది. తాజాగా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కీలక అప్డేట్లు ఇచ్చాడు తేజ. మిరాయ్-2 సినిమా కచ్చితంగా ఉంటుంది. రానాకు ఇంకా స్క్రిప్ట్ చెప్పలేదు. మొదటి పార్టును మించి ఆ సీక్వెల్ ఉంటుంది. అందులో కొన్ని సర్ ప్రైజ్ లు కూడా ఉంటాయని తెలిపాడు తేజ. కాకపోతే దానికి ఇంకొంచెం టైమ్ పడుతుందన్నాడు తేజ.
Read Also : Shraddhakapoor : అతనితో డేటింగ్ పై స్టార్ హీరోయిన్ హింట్.. మొత్తానికి చెప్పేసింది
జై హనుమాన్ సినిమాపై అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ, రిషబ్ శెట్టి వారి ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. అవి అయిపోగానే ఆ సినిమా స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జాంబిరెడ్డి సీక్వెల్ కు అన్నీ రెడీ అవుతున్నాయి. అది మరింత కామెడీ, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతోందని తెలిపాడు తేజ. త్వరలోనే వాటికి సంబంధించిన అప్డేట్లు ఇస్తానని తెలిపాడు తేజ. ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అంటే రాబోయే రోజుల్లో తేజ నుంచి మరిన్ని హై ఓల్టేజ్ సినిమాలు ఖాయం అని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Read Also : K-RAMP Teaser : బోల్డ్ లిప్ లాక్ లు.. టీజర్ నిండా బూతులు..
