Shraddhakapoor : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ గురించి ఏ చిన్న విషయం అయినా సోషల్ మీడియా ఊగిపోతుంటుంది. ఆమె కొన్ని రోజులుగా స్క్రిప్ట్ రైటర్ రాహుల్ మోడీతో లవ్ లో ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ అప్పట్లో ఓ రెస్టారెంట్ లో డిన్నర్ తర్వాత బయటకు వచ్చారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య రూమర్లు స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి తరచూ ఇద్దరూ బయట కనిపిస్తున్నారు. అంబానీ కుటుంబంలో పెళ్లికి కూడా ఇద్దరూ కలిసి వెళ్లారు. దీంతో ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. కానీ వీరు మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా శ్రద్దా చేసిన పోస్టుతో క్లారిటీ వచ్చేసింది. మీ కోపాన్ని, చిరాకును భరించే వ్యక్తి మీ లైఫ్ లో ఎవరు అంటూ ఆ వీడియోకు రాసుకొచ్చింది.
Read Also : Amisha Patel : నాలో సగం ఏజ్ ఉన్న వాళ్లతో డేటింగ్ చేస్తా.. మహేశ్ బాబు హీరోయిన్ ఆఫర్..
పైగా దానికి రాహుల్ ను ట్యాగ్ చేసింది. ఇంకేముంది ఈ పోస్టు కాస్త క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. ఈ పోస్టుతో శ్రద్దా కపూర్ తన లవ్ ను రాహుల్ మోడీతో కన్ఫర్మ్ చేసిందంటూ కామెంట్లు వస్తున్నాయి. మొత్తానికి ఇలా హింట్ ఇచ్చేసిందని అంటున్నారు నెటిజన్లు. శ్రద్దా కపూర్ కు సోషల్ మీడియాలో భారీ క్రేజ్ ఉంది. స్త్రీ 2 సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది ఈ క్రేజీ హీరోయిన్. కుర్రాళ్లకు ఫేవరెట్ హీరోయిన్ గా ఉన్న ఈ బ్యూటీ.. ఒక రైటర్ తో ప్రేమలో పడటం అందరినీ షాక్ కు గురి చేసింది. మరి డైరెక్ట్ గా ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి.
Read Also : K-RAMP Teaser : బోల్డ్ లిప్ లాక్ లు.. టీజర్ నిండా బూతులు..