దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు ఉక్రెయిన్ రాజధాని కైవ్‌లో ఓ భారీ సాంగ్ ను రూపొందిస్తోంది. ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. డివివి దానయ్య ఈ భారీ పాపాన్ ఇండియా యాక్షన్ డ్రామాను నిర్మిస్తున్నారు. మరోవైపు “ఆర్ఆర్ఆర్” టీం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. నిన్న “ఆర్ఆర్ఆర్” మేకర్స్ సినిమా లొకేషన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ సరదాగా ఉన్న ఓ వీడియోను షేర్ చేశారు.
Read also : జాన్వీ కపూర్ బోల్డ్ ఫోటోషూట్ వైరల్
ఆన్-లొకేషన్ లో సెట్ లో హీరోలిద్దరూ నవ్వుతూ సరదాగా గడుపుతున్న వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది. అయితే కొంతమంది మాత్రం ఆ వీడియో ఎన్టీఆర్ నుదిటిపై గాయం గుర్తించారు. దీంతో యంగ్ టైగర్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ దీనిపై సీరియస్ వివరణ కావాలంటూ ట్వీట్లు చేస్తున్నాయి. వాళ్ళ ఆందోళన చూసిన “ఆర్ఆర్ఆర్” టీం బ్రహ్మానందం మీమ్ తో సమాధానమిచ్చింది. ఇది కేవలం మేకప్ అని వాళ్లు చెప్పడంతో అభిమానులు కూడా కూల్ అయ్యారు.
https://twitter.com/RRRMovie/status/1423993412131246082/photo/1