Tanushree Dutta: నాకు ఏదైనా జరిగితే దానికి కారణం ఆ హీరోనే.. వదిలిపెట్టకండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tanushree Dutta: తనుశ్రీ దత్తా.. ఈ పేరు వారుండరు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తను అంతకంటే ఎక్కువగా మీటూ ఉద్యమానికి నాంది పలికి ఫేమస్ అయ్యింది. మొట్ట మొదటిసారి ఒక హీరో తనను లైంగికంగా వేధించాడంటూ మీడియా ముందుకు వచ్చి చెప్పిన హీరోయిన్ తనుశ్రీ దత్తా. ఈమె ఇచ్చిన ధైర్యంతోనే మిగతా హీరోయిన్లు తమకు ఎదురైన చేదు అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో నానా పటేకర్ తననుశారీరకంగా వేధించాడని బాహాటంగా చెప్పి ఎన్నో అవమానాల పాలయ్యింది. ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. మీటూలో నానా పటేకర్ పై ఆమె చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని బాలీవుడ్ మాఫియా ఆమెను వేధించడం మొదలుపెట్టాయి. దాదాపు ఐదారేళ్లుగా ఆ వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. అదే విషయాన్ని ఆమె తాజాగా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకొంది.
“నాకు ఏదైనా జరిగితే దానికి కారణం #metoo నిందితుడు నానా పటేకర్, అతని లాయర్లు & సహచరులు & అతని బాలీవుడ్ మాఫియా స్నేహితులే బాధ్యులని తెలియజేస్తున్నాను. బాలీవుడ్ మాఫియా ఎవరు అని అంటే.. ఎస్‌ఎస్‌ఆర్(సుశాంత్ సింగ్ రాజ్ పుత్) మృతి కేసులో వారి పేర్లన్నీ తరచూ తెరపైకి వచ్చినవారే. (అందరికీ ఒకే క్రిమినల్ లాయర్ ఉన్నారని గమనించండి). వారి సినిమాలను చూడకండి, వాటిని పూర్తిగా బహిష్కరించండి. ప్రతీకారంతో నా తరుపున వారిని వెంబడించండి. వారిని వదిలిపెట్టకండి. నన్ను చాలా వేధించినందుకు వారి జీవితాలను నరకయాతన చేయండి. చట్టం & న్యాయం నాకు విఫలమై ఉండవచ్చు కానీ ఈ గొప్ప దేశ ప్రజలపై నాకు నమ్మకం ఉంది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. తనుశ్రీ ఈ విధంగా చెప్పడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు హత్యా బెదిరింపులు వస్తున్నాయి అనుకుంటా.. దయచేసి ఆమెకు సహాయం చేయండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు పోలీసుల వద్దకు వెళ్లి ప్రొటక్షన్ తీసుకోమ్మని సలహాలు ఇస్తున్నారు.
Also Read
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..