Tamannaah: ఎట్టకేలకు పెళ్లి గురించి ఓపెన్ అయిన మిల్కీ బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamannaah: దాదాపు రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్ గా కెరీర్ కొన సాగిస్తుంది మిల్క్ బ్యూటీ తమన్నా ఆమె నటించిన తాజా చిత్రం గుర్తుందా శీతాకాలం.. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ సినిమాకు నాగశేఖర్ దర్శకత్వం వహించాడు. చినబాబు, ఎంఎస్ రెడ్డి సమర్పణలో శ్రీ వేదాక్షర ఫిలింస్, నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమా డిసెంబర్ 9న గ్రాండ్ గా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన తమన్నా ప్రెస్ మీట్లు ఇస్తూ సినిమా విషయాలను పంచుకుంటుంది. “రీమేక్ సినిమాలో నటించడం అనేది నాకు కొత్త కాదు. కానీ ఒరిజినాలిటీ ని మిస్ కాకుండా చాలెంజ్ లా తీసుకుని చేస్తాను. ఎందుకంటే వాళ్లు అప్పటికే క్యారెక్టర్స్ చేసి ఉంటారు కాబట్టి చూసే ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా
ఆ క్యారెక్టర్ చేయడం చాలెంజింగ్ గా తీసుకున్నాము. మిగతా సినిమాలతో చూస్తే లవ్ స్టోరీస్ లలో నటించి ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం కొంచెం కష్టమే.. కానీ ఈ సినిమాలో నేను చేసిన ఎమోషన్స్ క్యారెక్టరైజేషన్ ఆకట్టుకుంటాయి.
సినిమాను పోలిన సినిమాలు వస్తుంటాయి కానీ అందులో ఏదో కొత్త పాయింట్ ఉంటుంది ఇందులో కూడా కొత్త ఎమోషన్స్, కొత్త పాయింట్ ను ప్రేక్షకులకు చెబుతున్నాము.సత్యదేవ్ తో నటించడం చాలా సంతోషంగా ఉంది. తను నటించిన ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమా చూసిన తర్వాత ఆయన యాక్టింగ్ చాలా న్యాచురల్ గా అనిపించి తనతో చెయ్యాలని ఇంట్రెస్ట్ కలిగింది.. ఆ తర్వాత ఈ సినిమా ఆఫర్ రావడంతో ఆ కోరిక తీరుతూ ఇద్దరం కలసి మంచి ఎమోషన్ పండించడానికి అవకాశం దొరికింది. హీరోల్లో పెద్ద హీరో, చిన్నచిన్న హీరో అనే తేడాలు చూడను, ఎవరితోనైనా గాని నేను సినిమాను సినిమాగానే చూస్తాను. అయితే సినిమా కథ బాగుండాలి ఆ సినిమా ఆడియన్స్ కు నచ్చాలని కోరుకుంటాను. ఇందులో నేను స్టార్ హీరోయిన్ మిగతా వాళ్లు కొత్త వాళ్ళని ఎప్పుడూ అనుకోను. నా క్యారెక్టర్ వరకు నేను న్యాయం చేయాలని చూస్తాను. అయితే డైరెక్టర్ నాగ శేఖర్ గారు కూడా యాక్టర్ కావడంతో మాకు ఈజీ అయింది.
నేను ఇండస్ట్రీకి వచ్చి 17 ఇయర్స్ అయింది. ఇప్పటివరకు నాకు సినిమాపై ఉన్న క్రేజ్ తగ్గలేదు. ఫస్ట్ వచ్చినప్పుడు సినిమాపై నాకు ఎలాంటి ప్యాషన్ ఉందో ఇప్పుడు అదే ప్యాషన్ తో ఉన్నాను.
Also Read
- Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
- Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
- Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
- Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
ఓటిటిలు వచ్చిన తరువాత రీమేక్ సినిమాల ప్రభావం తగ్గినా మంచి సినిమా ఎప్పుడొచ్చినా చూడ్డానికి అడియన్స్ ఎప్పుడు రెడీగా ఉంటారు.ఇప్పుడు నేను కూడా ఓటిటి లకు వర్క్ చేస్తున్నాను యాక్టింగ్ పరంగా నాకు ఇంకొక ప్లాట్ ఫామ్ దొరికిందని ఫీలవుతున్నాను.
గుర్తుందా శీతాకాలం సినిమాను గీతాంజలి సినిమాలో పోలుస్తున్నారు.అది నాకు చాలా సంతోషంగా ఉంది.ఒక క్లాసిక్ సినిమాతో మా సినిమాను పోల్చినపుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ ను మేము రీచ్ అవుతాము అనే నమ్మకంతో ఉన్నాము.జనరల్ గా అందరి ఇళ్లలో అమ్మాయిలకుపెళ్లి గురించి ప్రెజర్ వున్నట్లే మా ఇంట్లో కూడా నన్ను ఎప్పట్నుంచో అడుగుతున్నారు,పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.
ఇప్పుడే నేను ఏ డివసిజన్ తీసుకోలేదు. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్, రూమర్స్ గురించి ఎక్కువగా ఆలోచించను, సీరియస్ గా తీసుకోను.భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న ప్రతి కథకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. నా దగ్గరకు వచ్చే కథలను కూడా నేను సీనియారిటీని పక్కన పెట్టి నటిగా నటించడానికి ప్రయత్నిస్తాను.ఈ సంవత్సరం F3 తరువాత ఇప్పుడు గుర్తుందా శీతా కాలం రిలీజ్ అవుతుంది. దీని తరువాత చిరంజీవి తో “భోళాశంకర్ ” ప్రాజెక్ట్ చేస్తున్నాను,అలాగే ఓటిటి లో మూడు ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. మలయాళంలో మొదటి సారిగా బాంద్రా సినిమా చేస్తున్నాను.ఈ సినిమతో మలయాళం ఇండస్ట్రీ కు పరుచయం అవుతున్నాను అని ముగించారు
తాజావార్తలు
-
CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
-
Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
-
Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
-
Trump-Jinping: 24న వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
-
Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!