Tamannaah Bhatia Response on Doing Kiss and Intimate Scenes: మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాతో పటు రజనీకాంత్ జైలర్ సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. భోళా శంకర్ సినిమా విషయానికి వస్తే. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా తమన్నా భాటియా హీరోయిన్ గా కనిపిస్తోంది. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ ‘జైలర్’లో కూడా కీలక పాత్రలో కనిపించనున్న తమన్నాతాజాగా తెలుగు మీడియాతో ముచ్చటిస్తూ రెండు సినిమాల విశేషాలు పంచుకున్నారు. ఒక రోజు గ్యాప్ లో మీరు నటించిన భోళా శంకర్, జైలర్ సినిమాలు విడుదలవుతున్న క్రమంలో ఆమె మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్, ఇండస్ట్రీ బిగ్గెస్ట్ స్టార్స్ అని వారితో కలిసి నటించడంతో నా కల నెరవేరినట్లయిందని అన్నారు.
Bhola Shankar: ‘భోళా శంకర్’ టికెట్ ధరలు ఫిక్స్.. మేకర్స్ కీలక నిర్ణయం?
అయితే ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తాను చిన్నప్పుడే సినిమా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చినా ఇప్పుడు తన కెరీర్ బాగుందని ఆమె పేర్కొంది. అంతేకాదు ఆమె తాను ట్రెండ్ ఫాలో అవుతా అని చెప్పుకొచ్చింది. “కొత్త తరాన్ని ఆకట్టుకోవడానికి, వారి ఆలోచనలు, అంచనాలకు అనుగుణంగా మనం మారాలని, లేకపోతే, మేము పాత వాళ్ళం అని ఫీల్ అవుతారని ఆమె అన్నారు. ఇటీవల సినిమాలు, వెబ్ కంటెంట్‌లో చాలా మార్పులు వచ్చాయని, అందుకే ముద్దులు, ఇంటిమేట్ సీన్స్ కు అంగీకరించానని అన్నారు. లేకుంటే దర్శకనిర్మాతలు నన్ను యువ హీరోలకు అక్కగానో, ఆంటీగానో పెట్టేవారు” అని ఆమె చెప్పుకొచ్చారు.