Tamannaah Bhatia become a best option to senior heros: హీరోయిన్స్ కి ఏజ్ పెరిగే కొద్ది క్రేజ్ తగ్గాలి. కొత్త బ్యూటీస్ ఎంట్రీతో ఆఫర్స్ లో కోత పడాలి కానీ మిల్కీ బ్యూటీ తమన్నా విషయంలో ఈ మ్యాటర్ రివర్స్ అవుతుందని అంటున్నారు. నార్త్ లో బోల్డ్ సీన్స్ తో రెచ్చి పోతున్నా ఆమెకు మాత్రం సౌత్ నుంచి క్రేజీ ఆఫర్స్ అకౌంట్ లో పడుతునే ఉన్నాయి. తమన్నా…టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తతం రజనీతో జైలర్, చిరుతో భోళా శంకర్ సినిమాల్లో నటిస్తున్న ఆమె సీనియర్ హీరోలకు పర్ఫెక్ట్ చాయిస్ అవుతోంది. నార్త్ లో జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో యాక్ట్ చేసి బోల్డ్ కంటెంట్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేసింది తమన్నా.
Nandita Swetha: కన్నీళ్లు పెట్టుకున్న నందితా శ్వేత..
అలా మత్తెక్కించి జాన్ అబ్రహం హీరోగా నిక్కిల్ అద్వానీ తెరకెక్కించే వేదలో ప్లేస్ కన్ఫామ్ చేసుకుంది. ఓవైపు మూవీస్, మరోవైపు వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉన్న తమన్నా ఇప్పుడు మరో జాక్ పాట్ కొట్టిందని కూడా ప్రచారం జరుగుతోంది. ఆమె కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తో జోడి కట్టబోతోందని అంటున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన వీరం బ్లాక్ బస్టర్ అయి కాసుల వర్షం కూడా కురిపించింది. అందుకే అజిత్ హీరోగా మగిల్ తిరుమేణిని తెరకెక్కించే ‘విడాముయిర్చి’ ప్రాజెక్ట్ లో ఈ బ్యూటీ ప్లేస్ కన్ఫామ్ అయిందని అంటున్నారు. నిజానికి ఈ సినిమాలో మొదట త్రిషను తీసుకున్నారు కానీ అమే డెట్స్ ఖాళీ లేకపోవడంతో మిల్కీ బ్యూటీకి ఈ జాక్ పాట్ దక్కిందని అంటున్నారు. ఆగస్ట్ లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.ఒక రకంగా హీరోయిన్ల్ కొరతతో ఇబ్బంది పడుతున్న సీనియర్ హీరోల ఆ హీరోల చూపంతా తమన్నా పైనే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.