టాలీవుడ్ నెక్ట్స్ సంక్రాంతికి రిలీజయ్యే లిస్ట్ లిమిటెడ్ నుండి అన్ లిమిటెడ్‌కు టర్న్ తీసుకుంది. ఒక్కొక్కరుగా పొంగల్ బరిలోకి దూసుకొస్తున్నారు. చిరంజీవి, నవీన్ పోలిశెట్టి ఎప్పుడో పండుగపై కన్నేస్తే.. ప్రభాస్, శర్వానంద్, రవితేజ రీసెంట్లీ జాయిన్ అయ్యారు. ఇక హీరోల మధ్య ఈ లెవల్లో కాంపిటీషన్ ఉంటే.. మరీ హీరోయిన్స్ మధ్య ఉండదా. ఈ సారి చాంతాటంత లిస్టే ఉంది.
ఫస్ట్ ఫస్ట్ పండుగకు కళ తీసుకురాబోతున్నారు గ్లామరస్ గర్ల్స్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్. జనవరి 9న రిలీజయ్యే రాజా సాబ్‌తో ఆడియన్స్‌కు మస్త్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఈ ముగ్గురు కెరీర్స్‌కు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్. ఫ్యామిలీ ఆడియన్స్ నాడి పట్టేసిన అనిల్ రావిపూడీ ఈ సారి బిగ్ బాస్ చిరంజీవిని వెంకీ మామను కలిపి తెస్తున్నాడు. బాక్సాఫీసు దగ్గర సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక చిరుకు జోడీ నయనతారను సెట్ చేశాడు. ప్రమోషన్లే చేయని నయన్ కూడా.. అనిల్ ఏ మాయ మాటలు చెప్పాడో.. ఫస్ట్ నుండి ప్రమోషన్ స్టార్ట్ చేసింది.
Also Read : OG : ఓవర్సీస్ లో OG హంటింగ్.. మరో రికార్డు నమోదు చేసిన హంగ్రీ చీతా
మీనాక్షి చౌదరికి సంక్రాంతి సెంటిమెంట్ బాగా కలిసొచ్చింది. ఈ పండుగకు వచ్చిన ప్రతిసారి హిట్ కొట్టేస్తోంది మీనూ. ఈ టూ పొంగల్స్ నుండి బ్లాక్ బస్టర్స్ నమోదు చేసింది మేడమ్. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారంతో పాటు ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాంతో ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. నెక్ట్స్ ఇయర్ పండుగకు నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజుకు రాణిలా మారబోతుంది. నారీ నారీ నడుమ మురారీ అంటూ బాలకృష్ణ ఓల్డ్ ఫిల్మ్ టైటిల్‌తో వచ్చేస్తోన్న శర్వానంద్ కూడా సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. ఇందులో సంయుక్త మీనన్, సాక్షి వైద్య యంగ్ బ్యూటీస్ పొంగల్ బరిలో దిగబోతున్నారు. వీరికి తోడు రవితేజ-కిషోర్ తిరుమల ఫిల్మ్ లో ఆశిఖా రంగనాథ్ తో పాటు మరో భామ కూడా ఉంది. టాలీవుడ్‌లోనే ఈ లెవల్లో కాంపిటీషన్ ఉంటే డబ్బింగ్ చిత్రాలైన జననాయగన్‌తో పూజా, మమితా.. కరుప్పుతో త్రిష, పరాశక్తితో శ్రీలీల వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా ఈ సంక్రాంతికి హీరోలే కాదు హీరోయిన్స్ కూడా పందెం పుంజుల్లా బరిలో దిగుతున్నారు.