Swaithi Mutyam Teaser: బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్వాతి ముత్యం. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రేపు హీరో బెల్లంకొండ గణేష్ పుట్టినరోజు కావడంతో చిత్ర బృందం అతడికి స్పెషల్ ట్రీట్ ఇచ్చింది. ఈ సినిమా టీజర్ ను తాజాగా రిలీజ్ చేసి గణేష్ కు బర్త్ డే విషెస్ తెలిపింది. టీజర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ఇందులో టైటిల్ కు తగ్గట్టే హీరో కూడా స్వాతి ముత్యంలానే కనిపిస్తున్నాడు.
అమ్మాయిలతో మాట్లాడాలంటే అతనికి ఎంత సిగ్గో ఈ టీజర్ లో చూపించారు. “మన బాల ఏం చేశాడో మీకు అర్థమయ్యేలా చెప్తాను” అంటూ వెన్నెల కిషోర్ వాయిస్ తో టీజర్ ప్రారంభమయ్యింది. అమ్మాయితో మాట్లాడడానికి ప్రయత్నించి.. ప్రయత్నించి గణేష్ ఆగిపోతూ ఉంటాడు.. హీరోయిన్ మీకు ఏదైనా ప్రాబ్లెమా అని అడగడం..ప్రాబ్లెమ్ ఏం లేదని గణేష్ చెప్పడం నవ్వును తెప్పిస్తోంది. ఇక చివర్లో ఇప్పటివరకు మీరు సింగిల్ గా ఎందుకు ఉన్నారో నాకు ఇప్పుడు అర్ధమయ్యింది అని హీరోయిన్ అనడంతో మనోడికి సిగ్గు ఎక్కువ అని చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి బెల్లకొండ బ్రదర్ ఆ ప్రాబ్లెమ్ ను ఎలా అధిగమించాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.